గోపీచంద్ కొంత కాలం క్రితం వరకు వరుస పరాజయా లతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు, అలా అలా పరాజయా లతో డీలా పడిపోయిన ఈ  హీరో కు సంపత్ నంది దర్శకత్వం లో తెర కెక్కిన సీటి మార్ సినిమా తో మంచి విజయం దక్కింది,  గ్రామీణ క్రీడ కబడ్డీ నేపధ్యం లో తెరకెక్కిన ఈ సినిమా తో మంచి విజయాన్ని అందుకని గోపిచంద్ ను మళ్లీ ఫామ్ లోకి తీసుకు వచ్చింది.  ప్రస్తుతం గోపీచంద్,  మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా ను యు వి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది, ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా, వీటికి జనాల నుండి మంచి ఆదరణ లభించింది,  మారుతి సినిమా లు ఎలా ఎంటర్టైన్మెంట్ గా సాగుతాయో, పక్కా కమర్షియల్ సినిమా కూడా ఆ పొందలోనే సాగబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా తో పాటు గోపీచంద్ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది, గోపీచంద్,  శ్రీవాస్ దర్శకత్వం లో  ఓ మూవీ ని చేయబోతున్నాడని తెలుస్తోంది, గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చాయి, ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి, వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడవ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నారు, ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది, త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: