నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగ్ రాయ్. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వంలో టికెట్ల విషయంలో నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సక్సెస్ మీట్ లో మాట్లాడిన దిల్ రాజు నాని మాట్లాడిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. అయితే నాని చెప్పిన విషయం వేరని కానీ అదే కమ్యూనికేట్ అవ్వడం వేరేగా అయిందని దిల్రాజు చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల సోమవారం జరిగిన ప్రెస్మీట్లో శ్యామ్ సింగరాయి టీం అందరూ హాజరు కావడం జరిగింది అందులో భాగంగా నాచురల్ స్టార్ నాని సాయి పల్లవి తదితరులు రావడం జరిగింది. ప్రెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు సాయి పల్లవి మరియు నాని ని పొగుడుతూ వారికి క్యారెక్టర్ను ఇవ్వడం ఆలస్యం అందులో మునిగిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే నేను మొట్టమొదట ఆఫీస్ పెట్టినప్పుడు ఒకే ఒక్కడు, స‌ఖి, నువ్వు వ‌స్తావ‌ని సినిమాల‌తో  మంచి విజయాన్ని సాధించాను.... అలా ఒక సినిమా చేస్తున్న కొద్ది మంచి మంచి హిట్ లను నేను అనుకున్నాను అనిపించింది.... తను నిర్మాతగా మారిన తర్వాత ఆర్య‌, బొమ్మ‌రిల్లు సినిమాల‌తో మూడు వ‌రుస హిట్స్ ఆయన కొట్టడం జరిగింది. అంతే కాకుండా ఆయన రెండు వేల పదిహేడు లో ఏకంగా ఆరు బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకోవడం జరిగింది. ఇక వాటి తరువాత గత రెండేళ్లుగా కరోనా కారణంగా చాలా ఇబ్బందులు వచ్చాయని.. ఇండస్ట్రీ ఎటు వెళుతుందో ఏమో అని భయం తర్వాత అఖండ‌, పుష్ప‌, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాల‌ను నైజాంలో విడుల చేస్తే.. మూడు సూప‌ర్  హిట్లు రావడం జరిగింది. ఎంతో ఆసక్తిగా మరియు ఎంతో ఉత్సాహంతో పని చేస్తున్న ఈ ఫీల్డ్ లో మంచి విజయాలు అనుకుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది అని ఆయన తెలిపారు.

ఇకపోతే డిస్ట్రిబ్యూట‌ర్స్‌, నిర్మాత‌గా ఇలాంటి మ్యాజిక్‌ను చూసిన‌ప్పుడు అంతులేని బలం వస్తుందని ఆయన చెప్పాడు. ఇక నాని అప్పటి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు చాలా మంది నెగటివ్ గా తీసుకున్నారు. అయితే హీరోగా నాని సినిమా థియేటర్ కి వచ్చి రెండేళ్లకు పైగా అయిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక దాని తర్వాత సినిమా థియేటర్ కి రావడానికి చాలా ఇబ్బంది పడడం అంటూ చెప్పాడు. అయితే నాని చేసిన వి సినిమా మరియు జగదీష్ రెండు సినిమాలు కూడా ఓటిటి లోనే విడుదల చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. ఇక ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్లు చాలా అభ్యంతరాలు చెప్పారని కూడా వెల్లడించాడు. ఇక ఆ రెండు సినిమాల తరువాత తన థియేటర్ వచ్చే సినిమానే ఇది అని ఆ ఉద్దేశంతో తను అన్నాడు అని వేరే ఉద్దేశంతో కాదు అని ఆయన స్పష్టం చేశారు. నాని అలా మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు అని దీన్ని ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: