టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువే. ఇతని సినిమాలు థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతాయని అభిమానులు వేచి చూస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారి వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే గతంలో మహేష్ బాబు ఒక సినిమా కథ నచ్చిందని చెప్పి.. ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటీ..? ఎందుకు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే వార్త అప్పట్లో బాగా ప్రచారం అయింది. ఆ సినిమా పేరే ‘శివమ్’. ఈ సినిమా స్టోరీ ఎంతో భిన్నమైందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని మహేష్ బాబు ఫ్యాన్ ఎంతో హంగామా చేశారు. అప్పట్లో ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా స్పందించారు. శివమ్ సినిమా స్టోరీ నాకు ముందే తెలుసన్నారు. కథ చాలా అద్భుతంగా ఉంటుందని.. సినిమా సూపర్ హిట్ కానుందన్నారు.
అయితే ఏమైందో తెలియదు. సినిమా స్టార్టింగ్‌లోనే క్లోజ్ అయింది. దర్శకుడు క్రిష్ సినిమా స్టోరీని మహేష్ బాబుకు చెప్పగా.. ముందు ఓకే చెప్పారు. కానీ ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో మహేష్‌ను కన్విన్స్ చేయలేకపోయారని సమాచారం. ఆ సమయంలోనే శివమ్ స్టోరీని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దర్శకుడు క్రిష్ హీరో రానాతో ఒక సినిమాను చేశాడు. అలా మహేష్ బాబు, క్రిష్ కాంబినేషన్‌లో ఆ సినిమా ఆగిపోయింది. క్రిష్ దర్శకత్వం వహించిన కథనాయకుడు, మహా నాయకుడు, కొండపొలం సినిమాలు నిరాశ పరిచాయి. కాగా.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ క్రిష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ సినిమా అయినా బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందా.. లేదా ఢీలా పడుతుందా అనేది వేచి చూడాలి.