టెక్నాలజీ పరంగా జియో , ఎయిర్టెల్ వంటి నెట్వర్క్లను మనం ఎక్కువగా 5g  కలిగిన సిమ్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాము. కాని ఇప్పుడు అలాంటి వాటిని బిఎస్ఎన్ఎల్ చెక్ పెడుతూ దేశవ్యాప్తంగా E -sim సేవలను ప్రారంభించాలని టాటా కమ్యూనికేషన్ తో కలిసి మూవీ ప్లాట్ఫారం ఆధారంగా E-SIM సేవలను ప్రారంభించబోతున్నారు. దీని ఆధారంగా అటు ఫిజికల్ సిమ్ అవసరం లేకుండానే ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ యాక్టివేషన్ చేసుకొనే విధంగా బిఎస్ఎన్ఎల్ సరికొత్త వైపుగా అడుగులు వేస్తోంది.


ఈ సిమ్ అంటే ఫిజికల్ సిమ్ కార్డు బదులుగా మొబైల్లోనే ముందే అమర్చిన చిప్ ను యాక్టివేషన్ చేసుకోవడమే.. మొబైల్లో సిమ్ కార్డు తీసి పెట్టాల్సిన అవసరమే ఉండదు.

E -sim ఎలా పనిచేస్తుందంటే ?
మొబైల్ ఆపరేటర్ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ వల్ల ఈ సిమ్ యాక్టివేషన్ అవుతుంది.

వినియోగదారులు డ్యూయల్ సిమ్ ఫోన్లో .. e-sim, ఫిజికల్ సిమ్ రెండు కూడా ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. ఒకే ఫోన్లో అనేక నెంబర్లను కూడా వాడుకునే సౌకర్యం కలదు.

దేశవ్యాప్తంగా 2G,3G,4G వంటి నెట్వర్కులను  అందిస్తోంది.


వినియోగదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే యాక్టివేషన్ అవుతుంది.

టాటా కమ్యూనికేషన్ మూవీ ప్లాట్ ఫామ్ లతో బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రిప్షన్ సదుపాయాన్ని అందిస్తోంది.


E -sim టెక్నాలజీ ఉపయోగాలు:
ఈ సిమ్ మనం విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ లోకల్ ఆపరేటర్స్ సేవల ద్వారా మనం పొందవచ్చు.

ఫిజికల్ సిమ్ లేని కారణం వల్ల మొబైల్ దొంగతనం, సిమ్ డ్యామేజ్ వంటి సమస్యకు రావు

డ్యూయల్ సిమ్ లాగే ఒకేసారి వేరువేరు నెంబర్లను ఉపయోగించుకోవచ్చు.

ఆగస్టు నెలలో తమిళనాడులో E- సిమ్ సేవలను మొదట ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీలో 4జి నెట్వర్క్ ని ప్రారంభించింది. అలాగే ఇండియన్ పోస్టల్ ద్వారా ఒప్పందం కుదుర్చుకోవడంతో దేశవ్యాప్తంగా 1.65 లక్షల పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఈ సిమ్ కార్డు రీఛార్జి సేవలు అందిస్తోంది. 4g సేవల కోసం సుమారుగా 37,000 కోట్లతో 97 వేల టవర్లను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: