చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్స్ గురించి కాంట్రవర్సీ జరగడం సర్వసాధారణమే. కానీ ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పాటలు ప్రేక్షకులలోకి వచ్చి అందులో కొన్ని పాటలు కూడా కాంట్రవర్సీని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నపటికి అందులో వచ్చిన పాటలు మాత్రం లు కాంట్రవర్సీని ఎదుర్కొంటున్నాయి. ఈ సంవత్సరంలో కాంట్రవర్సీకి గురైన పాటల గురించి ఒక్కసారి చూద్దామా.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా సారంగదారియా అనే పాట వివాదాలకు చోటు చేసుకుంది. అయితే ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా.. మంగ్లీ పాడారు. ఇకపోతే మరొక అమ్మాయి కూడా ఈ పాట నాదని, కాపీ కొట్టారు అని, మంగ్లీ పై తీవ్రంగా విమర్శించింది.

అలాగే ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే సినిమా ద్వారా విడుదలైన భజగోవిందం పాటని చెత్తగా చిత్రీకరించారు అని చాలా మంది విమర్శలు చేశారు. ఇక ఈ పాటను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఇక నాగశౌర్య హీరోగా నటించిన వరుడు కావలెను అనే సినిమా కోసం రాసిన దిగు దిగు నాగ అనే పాటకి మంచి ఆదరణ పొందినప్పటికీ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.  

ఇక సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా నుంచి విడుదలైన ఊ అంటావా.. ఊ ఊ అంటావా  ఐటమ్ సాంగ్ లో సమంత ఈ పాటకు స్టెప్పులేసిన సంగతి తెల్సిన విదితమే. ఈ పాటలో పదాలు మగవాళ్ళని కించపరిచేలా ఉన్నాయని వెంటనే తీసివేయాలని కోర్టులో కేసు వేసిన సంగతి తెల్సిన విషయమే. అయితే బోనాల పండగ సందర్భగా మంగ్లీ పాడిన మైసమ్మ పాటలో కొన్ని పదాలు చాలా అసభ్యకరంగా ఉన్నాయని వెంటనే తొలగించాలంటూ హిందువులు నిరసన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: