ఇక కొత్త సంవత్సరం కంటే ఎక్కువగా జనవరి 7న విడుదల కాబోయే "ఆర్ ఆర్ ఆర్" సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఇంకా అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్న ఈ సినిమా పై ప్రేక్షకులకి ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.యస్ యస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు చాలా జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ మధ్యనే విడుదల కావాల్సిన కొన్ని హిందీ సినిమాలు వాయిదా పడటం ఇంకా అలాగే కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో ప్యాన్ ఇండియన్ సినిమా అయిన "ఆర్ ఆర్ ఆర్" విడుదల పై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి.కరోనా లాక్‌డౌన్‌ వలన ఈ సినిమాని వాయిదా వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు కొందరు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా జక్కన్న రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పుకార్లను కొట్టిపారేయడం జరిగింది."ఆర్ఆర్ఆర్" సినిమా వాయిదా పడదని ఈ సినిమా అనుకున్న తేదీనే విడుదల అవుతుందని ఆయన చాలా కచ్చితంగా చెప్పారు. దీంతో అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.కాని ఇప్పుడు అనుకోకుండా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు ఈ మూవీ మేకర్స్.

https://twitter.com/AndhraBoxOffice/status/1477104879332061184?t=jtzgJSAgKkwbY5jaHYo5Ow&s=19

తాజాగా చాలా రాష్ట్రాలు నిబంధనలు విధించడంతో ఈ సినిమా టీం మరోసారి విడుదల తేదీని వాయిదా వస్తుంది. ఇక అఫీషయల్ అనౌన్స్మెంట్ ని కూడా చిత్ర బృందం వెల్లడించనుంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ కోసం ఎదురు చూసే అభిమానులకు షాక్ తగిలినట్లయింది.ఇక బాలీవుడ్ ఆలియా భట్ ఇంకా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ఇంకా రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr