సంక్రాంతికి రావాల్సిన రెండు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయో లేదో చిన్న సినిమాలు ఒక్కసారిగా జూలు విదిల్చాయని చెప్పాలి. ఒక్కసారిగా రాత్రికి రాత్రే పరిణామాలన్నీ మారిపోవడంతో పోటాపోటీగా తమ సినిమాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి చిన్న సినిమాలు.  ఆ విధంగా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యే సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి చిత్రం జనవరి 14 వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసింది చిత్రబృందం.

ఇక సిద్ధార్థ జొన్నలగడ్డ గా హీరోగా నటించిన డీజే టిల్లు చిత్రం కూడా జనవరి 14వ తేదీన విడుదల అవుతుంది.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిన్న వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు సినిమాపై మంచి అంచనాలు పెంచగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా ఆ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అలాగే గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న హీరో చిత్రం కూడా జనవరి 15వ తేదీన విడుదల అవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. 

ఇక దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన రౌడీ బాయ్స్ చిత్రం కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక నాగార్జున నటించిన బంగార్రాజు చిత్రం మొదటి నుంచి సంక్రాంతికి రావాలనే భావిస్తూ ఉండగా రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి లేకపోవడం ఈ చిత్రానికి ఎంతగానో ప్లస్ అయింది అని చెప్పాలి. సంక్రాంతి సినిమాలలో మంచి క్రేజ్ ఉన్న సినిమా ఇదే కాబట్టి ప్రేక్షకులు ఈ చిత్రానికే భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం మాత్రమే కాకుండా గ్యాంగ్ స్టర్ గంగ రాజు అనే కొన్ని చిన్న చిత్రాలు సైతం సంక్రాంతికి రానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: