విడాకుల అనంతరం సమంత తన జోరుగా ఎక్కడా తగ్గించడం లేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె క్రేజ్ మామూలుగా లేదు. దీంతో సమంత తన దూకుడును పెంచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని విధంగా తన అందచందాలను ఆరబోసింది. ఈ సినిమాలో ‘ఊ అంటావా మామ.. ఉహు అంటావా మామ’ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ సాంగ్ ఒక ఎత్తు అయితే.. అందులో ఆమె అందాలను ఆరబోసి అందరినీ ఔరా అనిపించింది.


ఈ ఐటమ్ సాంగ్‌కి సమంత ఏకంగా రూ.50 లక్షల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఆ పాట యూట్యూబ్‌లో 120 మిలియన్ వ్యూస్ వచ్చింది. అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ కోసం సమంత ఎంత కష్టపడిందో చూసి అభిమానులు అయ్యో పాపం అని కామెంట్లు పెడుతున్నారు. ఈ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్‌తో కలిసి డాన్స్ చేసిన మూమెంట్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక్కపాట కోసం హీరో, హీరోయిన్లు ఏ రేంజ్‌లో కష్టపడుతారనే విషయాన్ని నెటిజన్లు తెలుసుకున్నారు. కాగా, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అందరి నోట ఈ పాటనే వినిపిస్తోంది.


రచయిత చంద్రబోస్ రాసిన లిరిక్స్‌ కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటకు సమంత వేసిన మాస్ స్టెప్పులు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిచింది. ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ తన స్వరాన్ని అందించింది. సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం.. ఈ పాట రిలీజ్ కావడంతో సమంత కెరియర్‌కు మరింత హైప్ పెరిగింది. ఇప్పటికే సమంత తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించేందుకు సినిమాలు ఒప్పుకున్నారు. ఇటీవల మరో సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ‘యశోద’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: