భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో సూపర్ స్టార్ కమలహాసన్ ముందు వరుసలో ఉంటారు. ఆయన పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు మరియు చేసిన నట ప్రయోగాలు ప్రస్తుత తరంలో మరెవ్వరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్ స్థాయిని మించిన నటనా కౌసలం ఆయన సొంతం. పోషించే పాత్ర కోసం ప్రాణాలు పెడతారు. 

నటుడిగా ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన కమల్ వ్యక్తిగత జీవితం లో మాత్రం పూర్తి గా విఫలమయ్యారని చెప్పచ్చు . ప్రేమించి , పెద్దలను ఒప్పించి మొదట పెళ్ళి చేసుకున్న వాణి గణపతితో కాపురం మూణ్నాళ్ల ముచ్చటగా ముగిసిపోగా , సహజీవనం చేసి ఇద్దరి పిల్లల్ని కన్న తర్వాత రెండో సారి పెళ్లిచేసుకున్న నటి సారిక ఠాకూర్ తో సైతం వైవాహిక జీవితం సాఫీగా సాగిన దాఖలాలు లేకపోవడంతో ఆమెతో విడిపోయారు. పైన రెండు ఉదంతాలతో వివాహా వ్యవస్థ అంటే విసిగిపోయిన కమల్ తనకు అచ్చోచిన సహజీవనం వైపే మొగ్గు చూపి తనతో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన నటి గౌతమీ తో దశాబ్దం వరకు సహజీవనం విడిపోయారు. 

కమల్ హాసన్ రెండో భార్య, నటి శృతి హాసన్ తల్లి సారిక మొదట ప్రేమించింది కమల్ ని కాదంట , ఒక ప్రముఖ క్రికెట్ దిగ్గజాన్ని అంట. ఇంతకీ ఎవరూ ఆ క్రికెట్ దిగ్గజం అంటే అతనెవరో కాదు భారత క్రికెట్ కు మొదటి ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్ అంట. 

అత్యంత పిన్న వయస్సులో నే  భారత  క్రికెట్  జట్టులో చోటు సంపాదించిన కపిల్ దేవ్ తన అద్భుతమైన ఆట తీరుతో,  ఆరోజుల్లోనే యువతుల గుండెల్లో గుబులు రేపాడు. ఇందుకు బాలీవుడ్ నటి సారిక సైతం మినహాయింపు కాదు. ఒక ప్రముఖ పార్టీలో సన్నిహితులు ద్వారా మొదటి కలుసుకున్న వీరిద్దరూ తర్వాత కాలంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆరోజుల్లో వీరిద్దరి ప్రేమ బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. కపిల్ , సారిక ప్రేమ వ్యవహారం సాఫీగా సాగుతున్న సమయంలో కపిల్ సారిక తో  వివాహా బంధంలోకి అడుగుపెట్టాలకున్నారు. 

కపిల్, సారిక లు కలిసి ఒకసారి చండీగఢ్ లోని కపిల్ కుటుంబం మొత్తాన్ని కలవగా ,  కుటుంబం పరివారం మొత్తం సారికాతో కపిల్ వివాహానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వారి బంధానికి బ్రేకులు పడ్డాయి. తర్వాత ఒకరినొకరు పలకరించుకునే సంబంధాలు కూడా లేకపోవడం గమనార్హం. 

కపిల్ తో విడిపోయిన తర్వాత నటుడు కమల్ హాసన్ తో ప్రేమలో పడ్డ సారిక అతనితో సహజీవనం చేసి పెళ్ళి కాకుండానే శృతి , అక్షరాలను కనింది, ఆరోజుల్లో వీరిద్దరి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం . పిల్లలు పుట్టిన తర్వాత సారిక కమల్ పెళ్ళి చేసుకోంది. కానీ వారి వైవాహిక జీవితం సైతం 2004 లో ముగిసింది. 

సారిక తో విడిపోయిన తర్వాత కమల్ తన స్నేహితుడి సోదరి రోమి తో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహాం చేసుకున్నారు. వీరి కుమార్తె అమియా. తన కుటుంబంతో  సంతోషంగా జీవిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: