సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగారు. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో హీరోలంటేనే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ. వీరి సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్‌ కు పండగే. వీరి బాటలోనే వారి సంతానం కూడా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసులు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన స్టార్ ఈమేజ్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబుకి కరోనా సోకింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కాగా, వాళ్ల ఫ్యామిలీ తీవ్ర విషాదంలో చోటు చేసుకుంది.


అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణ పెద్దబ్బాయి.. మహేశ్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు హఠాత్తుగా మరణించారు. కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. దీంతో మహేశ్ బాబు ఇంట విషాదం చోటు చేసుకుంది.


కాగా, ఘట్టమనేని రమేశ్ బాబు 1977లో ‘మనుషులు చేసిన దొంగలు’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌ గా చేశారు. రమేశ్ బాబు దాదాపు 17 సినిమాల్లో నటించారు. అయితే అనుకున్న స్థాయిలో రమేశ్ బాబు సినిమాలో రాణించలేదు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో.. ఆయన నిర్మాతగా మారిపోయారు. అప్పటివరకు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. మహశ్ బాబు హీరోగా నటించిన ‘అతిథి, అర్జున్’ సినిమాలు, ఆ తర్వాత ‘ఆగడు, దూకుడు’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ వంటి సినిమాల్లో రమేశ్ బాబు బాలనటుడిగా నటించారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈయన మృతిపై పలువురు  సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: