ఒకప్పుడు సినిమా హిట్టా ప్లాపా అని చెప్పడానికి ఆ మూవీ ఎన్ని రోజులు ఆడింది అనేది ఎక్కువగా చెప్పుకునే వారు. 25 రోజులు ఆడితే యావరేజ్ హిట్ అని ఇంకా 50 రోజులు ఆడితే హిట్ అని అలాగే 100 రోజులు ఆడితే సూపర్ హిట్ అని 150 ఇంకా 175 రోజులు ఆడితే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకునే వాళ్ళు.తర్వాత ఎన్ని రోజులు ఎన్ని సెంటర్ లలో ఆడింది అనేదాన్ని బట్టి సినిమా హిట్, యావరేజ్, బ్లాక్ బస్టర్ అనేది అప్పుడు డిసైడ్ చేసేవారు. అవన్నీ కూడా ఈ టీవీలు రాని రోజుల్లో చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు అందరి ఫోన్లలో సినిమా ప్రపంచం ఉంటుంది.ఒకరోజులో ఎన్ని సినిమాలైనా చూడొచ్చు. సినిమా రిలీజ్ అయిన 3,4 వారాలకే డిజిటల్ రిలీజ్ అనేది అయిపోతుంది. ఇక అందుకోసం ఓటిటి సంస్థలు కూడా కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాయి. పైగా ఇంకో పక్క కరోనా పాండమిక్ ఒకటి. ఇన్ని అడ్డంకుల మధ్య ఓ సినిమా 50 రోజులు ఆడింది అంటే నిజానికి దానిని గ్రేట్ అనే చెప్పుకోవాలి. 2020 నుండీ 2022 సంక్రాంతి వరకు కూడా కేవలం 7 సినిమాలు 50 రోజులు థియేటర్లలో ఆడాయి. మరి ఆ సినిమాలెంటో చూద్దాం..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు  సినిమా 2020 సంక్రాంతికి విడుదలై ఈ చిత్రం 175  కేంద్రాల్లో 50 రోజులు ఆడి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాకుండా 240 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు రాబట్టిన టాప్ 50 సినిమాలలో సౌత్ ఇండియా తరుపున ఏకైక సినిమాగా నిలిచింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా 2020 సంక్రాంతికి విడుదలై ఈ చిత్రం 175 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.మాస్ మహారాజా రవి తేజ కం బ్యాక్ హిట్ సినిమా క్రాక్  2021 సంక్రాంతి కానుకగా విడుదలై ఈ చిత్రం కూడా 110 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన 2021 ఫిబ్రవరిలో విడుదలై ఈ సినిమా 100 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.ఇక జాతి రత్నాలు 50 కేంద్రాల్లో 50 రోజులు,పెళ్ళిసందD 5 కేంద్రాల్లో 50 రోజులు ఇంకా రీసెంట్ గా బాలయ్య బాబు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్  'అఖండ'  సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సినిమా 103 కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: