టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన రాజశేఖర్ ఎప్పటినుండో విలన్ పాత్రలో నటించడానికి అనుకూలంగానే ఉన్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్నారు, కొంతకాలం క్రితం రాజశేఖర్ కు కొన్ని క్రేజీ సినిమాల్లో విలన్ అవకాశాలు వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి,  కాకపోతే అవి ఏవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇలాంటి సందర్భంలోనే రాజశేఖర్ కు గోపిచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న  సినిమాలో ప్రతినాయకుడి పాత్ర అవకాశం వచ్చింది అంటూ గత కొన్ని రోజుల క్రితం అనేక వార్తలు బయటకు వచ్చాయి, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అంటూ వార్తలు వస్తున్నాయి, కారణం ఏమిటి అనేది ఇప్పటి వరకు తెలియదు.

  కానీ ప్రస్తుతం రాజశేఖర్ మాత్రం గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ ల తెరకెక్కబోతున్న సినిమా నుండి తప్పుకున్నట్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో ఇదివరకు లక్ష్యం , లౌక్యం అనే రెండు సినిమాలు తెరకెక్కాయి, ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్  దగ్గర మంచి విజయాలను సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టాయి.  అయితే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ హైట్రిక్ సినిమాపై జనాల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి, ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి రాజశేఖర్ తప్పకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పాత్రలో జగపతిబాబు ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి, కానీ ఇప్పటివరకు ఈ వార్తల పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ 'శేఖర్' అనే సినిమాలో హీరోగా నటించాడు, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా   వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: