ఇక టాలీవుడ్‌ హీరో సుమంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి అసలు తెలియని వారుండరు. నాగేశ్వరావు మానవడిగా ఇంకా నాగార్జున అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కెరీర్ స్టార్టింగ్ లోనే వరుసగా పెద్ద పెద్ద హిట్లు సొంతం చేసుకున్నారు. తరువాత వరుస ప్లాపులు ఎదురవ్వడంతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక బ్లాక్ బస్టర్ కథలు ఆయన చెంతకు వచ్చినా కాని రిజెక్ట్ చేశాడు. సుమంత్ రిజెక్ట్ చేసిన ఆ కథలు వేరే హీరోస్ చేసి వారు ఇప్పుడు పెద్ద స్టార్ హీరోస్ అయ్యారు. అయితే ఆ విషయం పక్కనపెడితే హీరో సుమంత్‌.. తనకు పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నాడు. అప్పటి టాలీవుడ్ నటి అయిన కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్‌… కొన్ని సంవత్సరాలకే ఆమెతో విడి పోయారు.

ఇక సుమంత్ తో విడిపోయిన తరువాత హీరోయిన్‌ కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో బాగా సెటిల్‌ కూడా అయింది. కానీ హీరో సుమంత్‌ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు సింగిల్‌ గానే ఉంటున్నారు.”ఇక నాకు తెలిసిన చాలామంది విడాకులు తీసుకున్నారు. నా కుటుంబంలో కూడా విడాకులు అనేవి ఉన్నాయి. దురదృష్టవశాత్తు విడాకులు అనేది ఇప్పుడు చాలా కామన్‌ అయిపోయింది. కాని ఈ విషయంలో.. నేను మాత్రం ఈ దుర దృష్టం అనే పదం కూడా అసలు వాడదలుచుకోలేదు. కాని అలా జరుగుతన్నాయంతే. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలు అనేవి వున్నప్పటికిని అడ్జెస్ట్‌ అయిపోతున్నారు” అంటూ సుమంత్‌ ఆసక్తికర కామెంట్స్ ని చేశారు. ఇప్పుడు సుమంత్ చేసిన ఈ కామెంట్స్ అనేవి చాలా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే మళ్ళీ రావా సినిమాతో లాస్ట్ హిట్ అందుకున్న సుమంత్, ప్రస్తుతం మళ్ళీ మొదలైంది, అనగనగా ఒక రౌడీ, ట్విస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: