శుక్రవారం సినీ ఇండస్ట్రీకి బాగా సెంటిమెంటల్ గా వర్కౌట్ అయిన రోజు, అందుకే ఏ సినిమా విడుదల చేయాలన్నా శుక్రవారం రోజునే ఫిక్స్ చేసుకుంటుంటారు. కాగా ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవడానికి రెడీ అయిపోయాయి. వాటిలో రేపు రవి తేజ ఖిలాడీ మూవీ కూడా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. క్రాక్ సినిమా మొదలు హిట్ ట్రాక్ లో జోరు మీదున్న రవితేజ ఇపుడు ఈ సినిమా తోను తన సక్సెస్ స్పీడ్ ను పెంచుతారని అంతా ఆశిస్తున్నారు. మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మూవీ ప్రమోషన్స్ విషయం లోనూ టీం చాలా చురుగ్గా వ్యవహరించి అభిమానుల ఆసక్తిని మరింత పెంచే విధంగా ప్రమోషన్స్ చేస్తూ రావడం కూడా ఒక ప్లస్ అయ్యింది. హిట్ గ్యారంటీ అయితే అధికారికంగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ బోర్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ సందడి చేస్తున్నారు రవి తేజ అభిమానులు. ముందుగా చెప్పిన విధంగానే ఈ చిత్రంలో రవితేజ పాత్రతో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని రేపటితో ఆ సస్పెన్స్ రివీల్ అవుతుందని అంటున్నారు.

అయితే ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలలో మొదటగా చెప్పుకోవాల్సింది యువ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి అని చెప్పాలి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క పాట కూడా శ్రోతలను ఆకట్టుకుని లక్షల వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అంతే కాకుండా దేవి శ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని మొన్న విడుదల చేసిన ట్రైలర్ ద్వారా తెలిసింది. అయితే సినిమా విజయంలో దేవి శ్రీ పాత్ర ఎంత వరకు ఉంటుంది అనేది తెలియాలంటే రేపు ఉదయం మొదటి షో అయితే కానీ తెలియదు.




మరింత సమాచారం తెలుసుకోండి: