సినిమాలు పలు రకాల జోనర్లపై వస్తుంటాయి. కానీ లవ్ జోనర్ మాత్రం ఎప్పుడూ స్పెషలే అలాగే ఎవర్ గ్రీన్. అలా లవ్ జోనర్ తో వచ్చి తమ కెరియర్ నే ఓ రేంజ్ లో సెట్ చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు. వారెవరు ఆ సినిమాలు ఏవి ఒకసారి చూద్దాం పదండి.

దేవదాస్

దేవదాసు సినిమాను వేదాంతం రాఘవయ్య ఒక రొమాంటిక్ ప్రేమకథాచిత్రంగా తెరకెక్కించారు. అప్పుడప్పుడు టాలీవుడ్ ఎదుగుతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రిలు మెయిన్ లీడ్ పాత్రలలో నటించారు. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 69 ఏళ్లు గడుస్తున్నాయి, ఇండస్ట్రీలో తరాలు మారుతున్నాయి. అయినా టాలీవుడ్ లో ది బెస్ట్ ప్రేమ కథాచిత్రం అంటే మొదటగా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. దేవదాస్ అనే పాత్రని ప్రేక్షకులు అంతగా తమ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇదో అందమైన ప్రేమకథ. మరుపురాని వ్యద.. ఈ సినిమా  ఓ ట్రెండ్ సెట్టర్, ప్రేమ విఫలమైతే భుజంపై కండువా, చేతిలో సీసా, పక్కన కుక్క, మాసిన గడ్డం ఇది కదా నాటికి నేటికి ట్రెండ్.

ప్రేమాభిషేకం

సినిమా దర్శకరత్న దాసరి నారాయణరావు ఎంతో అద్బుతమయిన ప్రేమకావ్యంగా రూపొందించారు. అలనాటి అందాల తార శ్రీదేవి మరియు నాగేశ్వరరావు కలయికలో వచ్చిన చిత్రం ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనస్సులో ఉంది. మరొక పాత్రలో జయసుధ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా అప్పట్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలు ఏ ఎన్ ఆర్ ను ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేలా చేశాయి. అప్పట్లో లవ్ స్టోరీ అంటే ముందుగా ఏఎన్ఆర్ కే కాల్స్ వెళ్ళేవి.

గీతాంజలి

తెలుగు సినిమా చరిత్రలో కొందరు డైరెక్టర్లు అలా గుర్తుండిపోతారు. ఆ తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున మూవీ గీతాంజలి కూడా అంతే స్పెషల్ గా నిలిచింది. నాగ్ కు మన్మధుడుగా లైన్ మొదలయ్యింది.

మజ్ను

అదే విధంగా దాసరి నారాయణరావు నాగార్జున తో తీసిన మజ్ను మూవీ ఎంత సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇందులో నాగార్జున ప్రేమలో ఓడిపోయి ఎంత చిత్రవధ అనుభవిస్తాడో చూశాము. అలా ఎన్నో ప్రేమకథాచిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇవి కేవలం నాగేశ్వరరావు మరియు నాగార్జునలు నటించిన ఉత్తమమైన ప్రేమకథా చిత్రాలు మాత్రమే. ఆ విధంగా ఇంకా చాలానే ఉన్నాయి.









మరింత సమాచారం తెలుసుకోండి: