తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్ ఆయన హీరోలలో నాగచైతన్య ఒకరు.. అందుకు కారణం ఒక విధంగా సమంతానే అని చెప్పవచ్చు.. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక చోట ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉండేది.. ఇక విడిపోయాక కూడా వీరిద్దరి పేర్లు బాగానే వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటూ తమ కెరీర్ ను ముందుకు సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది నాగచైతన్య, తన తండ్రితో కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి ప్రేక్షకాదరణ పొందింది.. అయితే ఇటీవలే ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ Zee-5 లో స్ట్రీమింగ్ చేయడం జరిగింది.. అయితే Zee - 5 చరిత్రలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది బంగార్రాజు సినిమా.. ఇక వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


నాగార్జున కు సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత.. అంత విజయాన్ని మళ్లీ బంగార్రాజు సినిమానే  విజయాన్ని చేకూర్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇక ఈ సినిమాలో సోగ్గాడే చిన్నినాయన లో ఉండే కొన్ని పాత్రలను అలాగే కంటిన్యూ చేస్తూ బంగార్రాజు సినిమాలో తెరకెక్కించడం జరిగింది. లవ్.. యాక్షన్.. కామెడీ.. ఎమోషనల్ వంటి వాటితో సినిమాలో చాలా అద్భుతంగా తెరకెక్కించారు కళ్యాణ్ కృష్ణ.. సిద్ శ్రీరామ్ గానాలాపన చేసిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది అని చెప్పవచ్చు..


ఇకపోతే ఈ సినిమా ఓటీటీలో ప్రసారమౌతున్న నేపథ్యంలో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డును నమోదు చేసుకోవడం గమనార్హం.. ఇక ఈ సినిమా హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా Zee - 5 అత్యున్నత స్థానానికి చేర్చిందని చెప్పవచ్చు. ఏదేమైనా బంగార్రాజు అతి తక్కువ సమయంలోనే ఇంతటి ఫీట్ ను అందుకోవడం చాలా గర్వకారణం గా ఉంది అంటూ చిత్రం యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: