మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం పేరు ఆచార్య. కరోనా వలన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఉగాది సందర్భంగా ఆచార్య చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు.

నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటైర్‌టైన్‌మెంట్ కూడా ప్రకటించాయి. అంతా బాగానే ఉందని అనుకుంటున్న తరుణంలో కోవిడ్ ప్రభావం పెరుగుతూ రావడంతో దానిని వాయిదా వేశారు.


ఇటీవల ఏప్రిల్ 29న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుందట. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు.


చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జతగా పూజాహెగ్డే ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం కూడా

అందించారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కిందట  .


సినిమా రఫ్ కట్ మూడు గంటలకు లాక్ చేయబడినట్టు సమాచారం.ఈ విషయం తెలుసుకున్న చిరు కనీసం 15 నిమిషాలు ట్రిమ్ చేయాలని పట్టుబట్టినట్టు సమాచారం . చిత్రంలో రామ్ చరణ్ సన్నివేశాలు చాలా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల కానుంది.


ఇటీవల చిరంజీవి, రెజీనా కాంబినేషన్లో తెరకెక్కించిన 'సానా కష్టం' అనే ఐటెం సాంగ్‌ను విడుదల చేయగా యూట్యూబ్‌లో బాగా దూసుకుపోతోంది. మెగాస్టార్ స్టెప్పులు, రెజీనా అందాలు ఈ పాటను ఓ రేంజ్‌లో నిలబెట్టాయట. అయితే ఈ పాటే 'ఆచార్య' యూనిట్‌కు చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోందట.పాట మధ్యలో 'ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్ళే ఆర్ఎంపీలు అవుతున్నారే' అన్న లైన్ ఉంటుందట ఆ పదాలే ఆర్ఎంపీ డాక్టర్లకు కోపం తెచ్చాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: