టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న  లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను తన అకౌంట్లో వేసుకుంటూ వస్తోన్న మహేష్ బాబు, ఈ సినిమా టైటిల్ మొదలుకొని ఆయన ఫస్ట్‌లుక్ వరకు అన్నీ కూడా ఎంతో వైవిధ్యంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి 'కళావతి' అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ పాటకు యస్ యస్ థమన్ అందించిన సంగీతం ఒక ఎత్తైతే.. సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడిన తీరు మరో ఎత్తనే చెప్పాలి. ఇక ఈ సాంగ్ కి మహేష్ వేసిన స్టెప్స్‌కు ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫుల్ ఫిదా అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ వేసిన స్టెప్స్ చాలా ఈజీగా ఉండటమే కాకుండా పాటకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ సింక్‌లో ఉండటంతో ఈ స్టెప్స్‌తో జనం సోషల్ మీడియాలో బాగా దుమ్ములేపారు. ఇలా ఈ పాటకు ఎక్కడలేని క్రేజ్ రావడంతో తాజాగా 'కళావతి' సాంగ్ ఓ సరికొత్త మైల్‌స్టోన్‌ను అందుకుంది.



కళావతి లిరికల్ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ పైగా రాబట్టి 1.7+ మిలియన్ లైకులను సంపాదించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్‌కు ఇదొక నిదర్శనం అని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక మొన్న 'పెన్నీ' అనే రెండో సాంగ్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ పాట కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతుంది. విడుదల అయిన మొదటి రోజే 18 మిలియన్ల పైగా వ్యూస్ రాబట్టి టాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ వ్యూస్ సాంగ్ గా రికార్డు సృష్టించింది.మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ రెండు పాటలతో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చి ఫుల్ ఖుషి చేశారు.ఇలా సాంగ్స్ రికార్డులు సెట్ చేస్తుండటంతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషిగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: