టాలీవుడ్ లో
మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే హీరోల్లో ఒకరు గోపీచంద్. ఇప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన సరైన విజయాన్ని అందుకొని చాలా రోజులు అయింది అని చెప్పాలి. విషయం ఏదైనా కూడా గోపీచంద్ ప్రేక్షకులను నిరాశ పరచడం ఆయన అభిమానులను ఏ మాత్రం మెప్పించడం లేదు. దాంతో ఈ సారి చేయబోయే
సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరించాలని ఉద్దేశంతో కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను కమర్షియల్ సినిమాలు చేసే దర్శకుడిగా పేరున్న
మారుతి తో చేతులు కలిపాడు.
ఆయన దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే వినూత్నమైన సినిమాకి శ్రీకారం చుట్టాడు మ్యచో మ్యాన్. రాశి కన్నా
హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తొందర్లోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్రబృందం. ఈ
సినిమా విడుదలకు ముందే గోపీచంద్ తన తదుపరి
సినిమా అనౌన్స్ చేశాడు. ఆయనకు లక్ష్యం వంటి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు శ్రీవాస్ తో కలిసి లక్ష్యం 2 అనే
సినిమా చేస్తున్నాడు.
సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లను వాడే హీరోలు చాలా ఎక్కువగా ఉంటారు. ఒక
సినిమా హిట్ అయితే ఆ
సినిమా విషయంలో అవలంబించే విధానాలను తమ తదుపరి సినిమాల విషయంలో అవలంబిస్తూ ఉంటారు. ఆ విధంగా గోపీచంద్ లక్ష్యం అనే సినిమాతో విజయాన్ని అందుకోగా అప్పటినుంచి రెండక్షరాలు ఉన్న టైటిల్స్ ను పెట్టుకునే విధంగా ఆయన ముందుకు వెళుతున్నాడు. లౌక్యం సౌఖ్యం వంటి టైటిల్స్ తో వచ్చి ప్రేక్షకులలో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ ఇప్పుడు లక్ష్యం దర్శకుడితో వస్తున్నాడు కాబట్టి కొత్తగా వినూత్నంగా ప్రయోగించకుండా లక్ష్యం2 అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి గోపీచంద్ ఆలోచన ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.