బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్, హాలీవుడ్ స్టార్ ఒలివియా మోరిస్ కూడా ఈ సినిమలో నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

భరత దేశాన్ని బ్రిటీష్ పాలిస్తున్న రోజులు.. ఆదిలాబాద్ లో ఒక అమ్మాయిని తెల్లోడు ఎత్తుకెళ్తాడు. ఈ టైం లో ఆమెను కాపాడటానికి భీం వస్తాడు. మరో పక్క బ్రిటీస్ పాలనలోనే పోలీస్ గా చేస్తూ తల్లిదండ్రుల స్వాతంత్ర కోరిక తీర్చాలనే తపన ఉన్న సీతారామ రాజు కూడా ఉంటాడు. వీరి ఇద్దరు కలిసి ఎలా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించారు అన్నది ఆర్.ఆర్.ఆర్ కథ.

విశ్లేషణ :

దేశభక్తి కథని.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పాలనుకున్న రాజమౌళి ఆలోచన బాగానే ఉన్నా.. ఈ సినిమా జోనర్ కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య బ్రొమాన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఇంకా రాజమౌళి ఏదో మిస్ చేశాడన్న భావన కలుగుతుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమలో వెంకటేష్ మహేష్ ల బ్రొమాన్స్ చాలా బలంగా ఉందని అనిపిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ లో ఎమోషనల్ సీన్స్ విషయం లో కూడా కొద్దిగా గాడి తప్పినట్టు అనిపిస్తుంది.

సినిమా రెగ్యులర్ కమర్షియల్ టెంపోలోనే తీసుకెళాడు రాజమౌళి. ఎప్పటిలానే తనకు సూట్ అయ్యే బలమైన ఎమోషనల్ స్టోరీ ని ఎంచుకున్నా ఈసారి దాన్ని తెరకెక్కించడంలో ఎక్కడో ట్రాక్ తప్పాడని చెప్పొచ్చు. సినిమాలో కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తాయి. ఈ సినిమా అక్కడక్కడ నాగార్జున రాజన్న సినిమా ఫ్లేవర్ కనిపిస్తుంది. ఆ సినిమా కూడా ఇదే పంథాలో కొనసాగుతుంది.

సినిమా నేషనల్ వైడ్ గా.. వరల్డ్ వైడ్ గా ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి. బాహుబలిలో రాజ్యం రాజుల కథగా కాకుండా దేశభక్తి కథతో వచ్చాడు రాజమౌళి. వాయిస్ ఓవర్ కూడా కొద్దిగా అసంతృప్తిగా అనిపిస్తుంది. సినిమా వసూళ్లు.. రాజమౌళి గ్లోరీని పెంచినా సరే ఎక్కడో రాజమౌళి గౌరవం ఈ సినిమాతో తగ్గిందని అనిపిస్తుంది. అయినా ఈ మంచి ప్రయత్నానికి ఆర్.ఆర్.ఆర్ టీం కి శుభాకాంక్షలు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఆర్.ఆర్.ఆర్ సినిమా కెమెరా వర్క్ చాలా బ్రిలియంట్ గా చేశారు. రాజమౌళి ఎప్పటి సినిమాల్లానే సెంథిల్ అదరగొట్టాడు. సీజీ, వీ.ఎఫ్.ఎక్స్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ కొన్ని మాత్రమే రిజిస్టర్ అయ్యేలా ఉన్నాయి. కాస్టూంస్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ డిజైన్ అదిరిపోయింది. ఆర్ట్ వర్క్ బాగానే ఉందిఉ. డీఐ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ కూడా ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది.

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాలో రాం చరణ్ అదరగొటాడు. ఆర్.ఆర్.ఆర్ కి హీరో అంటే చరణ్ అని చెప్పొచ్చు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, రాయల్టీ, బాడీ లాంగ్వేజ్ అన్ని అదిరిపోయాయి. చరణ్ ని చాలా గొప్పగా చూపించాడు జక్కన్న. చరణ్ వాయిస్ ఓవర్ కూడా 1920 లో ఉన్న సౌండ్స్ చాలా ఫ్రెష్ గా చూపించారు. ఎన్.టి.ఆర్ భీం పర్ఫార్మెన్స్ టెరిఫిక్. తెలంగాణా యాసని ఎన్.టి.ఆర్ పలికిన తీరుకి మాటల్లేవు. ట్రైబల్ హీరోగా ఎన్.టి.ఆర్ పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ఇద్దరి హీరోల కాస్టూంస్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. బ్రిటీష్ గవర్నర్ అతని భార్య కాస్టింగ్ ఇంకా అలియా భట్, అజయ్ దేవగన్ అందరిని సరిగా వాడుకోలేకపోయాడని అనిపిస్తుంది. రాజమౌళి కెరియర్ లో ఫస్ట్ టైం పాత్రలని సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు.

బాటం లైన్ : రాజమౌళి విలువైన పొరపాటు..!

రేటింగ్ : 3/5


మరింత సమాచారం తెలుసుకోండి: