
ఇక అసలు విషయంలోకి వెళ్తే rrr చిత్రం ద్వారా రామ్ చరణ్ బాగా పాపులారిటీ సంపాదించారు. దీంతో కేజిఎఫ్ చిత్రాన్ని ఈరోజు సాయంత్రం 6:40 నిమిషాలకు రామ్చరణ్ చేతుల మీదుగా తెలుగులో ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు చిత్ర బృందం. ఇక బాలీవుడ్ నిర్మాత అయినటువంటి డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ సినిమాకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ని కన్నడలో నటుడు శివ రాజ్ కుమార్ విడుదల చేయబోతున్నారని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించినది. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ఏమిటంటే తమిళంలో ఈ చిత్ర ట్రైలర్ ను. హీరో సూర్య చేతులమీదుగా విడుదల చేయబోతున్నట్లు గా చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమాకు భారీగానే హైప్ పెరిగిందని చెప్పవచ్చు..
