
1).ఆస్కార్ అవార్డు చరిత్రలోనే అత్యధికంగా ఎక్కువ గెలుచుకున్నది వాల్ట్ డిస్నీ. ఇతను ఎక్కువగా యానిమేషన్ సినిమాలలోనే తనదైన ముద్ర వేసి 59 సార్లు నామినేట్ అవ్వగా అందులో 22 సార్లు మాత్రమే విజేతగా నిలిచారు.
2).ఆస్కార్ అవార్డు ప్రతిమ బంగారం కాదు.. కేవలం దానిని 24 క్యారెట్ల బంగారం పూత పూసి తయారు చేస్తారు. చూడడానికి మొత్తం బంగారం లాగానే కనిపిస్తుంది.
3). 50 ఆస్కార్ లు తయారు చేయడానికి మూడు నెలల వ్యవధి పడుతుందట. దీని విలువ మాత్రం కేవలం ఒక అమెరికా డాలర్ నే అట.
4). ఆస్కార్ అవార్డు గెలుచుకున్న వారు వీటిని అమ్మడానికి వీలు ఉండదు. అలా నమ్మకూడదని వారు కాంట్రాక్టు పైన సంతకం చేయవలసి ఉంటుంది.
5). 1953 మార్చి 19న బ్లాక్ అండ్ వైట్ టీవీ లో మొదటిసారిగా ఈ వేడుకలను ప్రారంభించడం జరిగింది.
6). చనిపోయిన తర్వాత కూడా ఆస్కార్ అవార్డు పొందినది కేవలం ఇద్దరు కళాకారులు మాత్రమే.. అందులో బ్రిటన్ నటుడు పీటర్ ఫించ్, మరొకరు ఆస్ట్రేలియన్ హీత్ లెడ్జెర్.
7). టైటానిక్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రానికి 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నది.
8). ఇప్పటి వరకు కేవలం 3 గురు లేడీ డైరెక్టర్లు మాత్రమే అవార్డులను గెలుచుకున్నారు. ఇవి కాక మరెన్నో ఉన్నాయి.