ఒక సినిమాలో హీరో , హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా కుదిరి , సినిమా మంచి విజయాన్ని సాధించినట్లు అయితే మరో సారి ఆ జంట ను  దర్శక నిర్మాతలు రిపీట్ చేయడానికి ఫ్లాన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా కొన్ని హీరో , హీరోయిన్  కాంబినేషన్ లు రిపీట్ అవుతున్నాయి, ఆ కాంబినేషన్ లు ఇప్పుడు తెలుసుకుందాం...

రామ్ చరణ్ ...  కియారా అద్వానీ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,  కియారా అద్వానీ  'వినయ విధేయ రామ'  సినిమాలో హీరో ,  హీరోయిన్లుగా నటించారు, ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు ,  ప్రస్తుతం వీరిద్దరూ  శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న  సినిమాలో హీరో , హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

నాని ... కీర్తి సురేష్ : నాని , కీర్తి సురేష్ , త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన నేను లోకల్ సినిమాలో కలిసి నటించారు,  ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది,  ప్రస్తుతం వీరిద్దరూ  దసరా సినిమాలో కలిసి నటిస్తున్నారు.

చిరంజీవి ... కాజల్ అగర్వాల్ : మెగాస్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ 'ఖైదీ నెంబర్ 150'   మూవీ లో  హీరో , హీరోయిన్ లుగా నటించారు, ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది,  ప్రస్తుతం వీరిద్దరూ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరో , హీరోయిన్లుగా నటిస్తున్నారు.

గోపీచంద్ ... రాశి ఖన్నా : గోపీచంద్ రాశి ఖన్నా , రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన జిల్ మూవీ లో మొదటి సారి కలిసి నటించారు,  ప్రస్తుతం వీరిద్దరూ మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మొవు లో మరో సారి కలిసి నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: