తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ లలో ఇలియానా కూడా ఒకరు. ఇలియానా మొదట దేవదాసు చిత్రం ద్వారా కుర్రకారును బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నీ బాగా ఉపయోగించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పోకిరి చిత్రంతో తన స్టార్ డమ్ మారిపోయింది అని చెప్పవచ్చు. అయితే ఆమె కెరియర్ బాగా ఉన్నప్పుడే బాలీవుడ్ లోకి వెళ్లి.. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్లాన్ చేసింది.

కానీ ప్రారంభంలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలను అందుకున్నప్పటికీ.. తెలుగులో సక్సెస్ అయినట్లు గా బాలీవుడ్ లో కూడా కాలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆండ్రూ నీబోన్ తో లవ్ లో పడింది. కొన్నాళ్లపాటు అతనితో తన జీవితాన్ని సాఫీగా గడిపింది. ఇక అలాంటి సమయంలో తన కెరియర్ పై అశ్రద్ధ చేయడం తో వివాహానికి ముందే తను గర్భవతి అయిందని  కథనాలు వినిపించాయి. ఇక అంతే కాకుండా అ*ర్షన్ చేయించుకొందని, ఆత్మహత్యకు సైతం పాల్పడిందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయంపై ఇలియానా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది.

ఇలియానా మాట్లాడుతూ సూసైడ్ చేసుకోవడానికి నేను అసలు ప్రయత్నం చేయలేదు. నేను ఇంకా బతికే ఉన్నానని నవ్వేసింది. ఇదంతా గతం. తన బాయ్ ఫ్రెండ్ తో కూడా దూరమయ్యానని తెలియజేసింది. అయితే ఈ విషయంపై తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈమె బాడీ షేమింగ్ పై కూడా పలు రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలో మరొక సారి తన ఆత్మహత్య విషయంపై స్పందించింది. తను ఈ మధ్య కాలంలో ఒక ఆర్టికల్ చూశాను..  కంటెంట్ లేదు.. ఒక చెత్త విషయం ఉందని.. అదేమిటంటే తనకు 12 సంవత్సరాల వయసు నుంచే శరీర సమస్యలు ఉన్నట్లుగా తెలియజేసింది. తను అందుకోసమే ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉంటాను అని తెలిసింది. ఇదే సమస్య వల్ల కొన్నాళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అయితే కొన్ని సమస్యల వల్ల అలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది అని అప్పుడు తెలిపింది. కానీ లావుగా ఉన్నాను అని చనిపోవాలనుకోలేదని  తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: