విజయ్ దేవరకొండ  శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావలసి ఉండగా ఇప్పటి దాక ఈ చిత్రం రాకపోవడంతో ఈ సినిమా అసలు ఉంటుందో లేదో అన్న అనుమానాలను కొంతమంది వ్యక్తం చేశారు. కానీ ఫైనల్ గా ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ మొదలుపెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఇప్పుడు కార్యాచరణ వరకు వెళ్లడం జరిగింది.

టక్ జగదీష్ సినిమా తర్వాత శివ నిర్వాన చేస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలని ఆయన భావిస్తున్నా డు. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్ ఖుషి అని పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో సినిమా ఓకే చేసుకోవడం నిజంగా శివ నిర్వాణ అదృష్టమనే చెప్పాలి. గతంలో ప్రేమ కథ సినిమాలు ఎంతో అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు గా ఉన్న శివ నిర్వాణ టక్ జగదీష్ తో కొంత ప్రయోగం చేసే ప్రయత్నం చేశాడు కానీ అది ఫలించలేదు.

దాంతో మళ్లీ ఆయన ప్రేమ కథ సినిమానే నమ్ముకున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ భారీ స్థాయిలో అలరిస్తుంద ని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు 21వ తేదీన చేయబోతున్నారట. ఆ వెంటనే 23 వ తేదీ నుంచి ఈ సినిమాకు సంబంధించి న షూటింగ్ మొదలు పెట్టబోతున్నరట. కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా తప్పకుండా పాటల పరంగా కూడా ప్రేక్షకులందరినీ చిత్రం ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. దీనికంటే ముం దు లైగర్ సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: