నాగచైతన్యతో సినిమా కోసం చాలా రోజులు ఎదురు చూసింది లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి. అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వచ్చి మంచి విజయాలన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే తొలి సినిమా తర్వాత ఆమె చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పింలేకపోయింది. సిద్ధార్థ్ తో కలిసి జబర్దస్త్ నాగ శౌర్య తో కళ్యాణ వైభోగమే అనే సినిమాలు చేసిన ఆమె వాటితో ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఓ బేబీ సినిమా చేసింది.

సమంత ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అన్నీ మంచి శకునములే అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరో గా నటిస్తుండగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.  అయితే ఈమె నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతుంది అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. కానీ ఎంతకీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక పోవడం తో ఆమె అభిమానులు అసలు ఈ సినిమా ఉందా లేదా అన్న అనుమానాలను వ్యక్త పరిచారు. 

అయితే ఆమె ఈ సినిమా ను పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక సినిమాను చేయడానికి కమిట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఆమె ఓ సినిమా చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మల కాన్వెంట్ మరియు రుద్రమదేవి చిత్రాల్లో నటించిన రోషన్ గత ఏడాది పెళ్లి సందడి సినిమా చేశాడు. ఫలితం ఎలా ఉన్నా కూడా ఈ సినిమా తన కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. యాక్టింగ్ తో పాటు డాన్సులు కూడా బాగా చేయగలను అనే పేరు తెచ్చుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు రోషన్. వైజయంతి మూవీస్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 9 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం తర్వాత అదే ప్రొడక్షన్ లో నందినిరెడ్డి దర్శకత్వంలో హీరోగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: