మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో ఒక ఈక్వేషన్స్ ఉంది. సినీ పరిశ్రమను శాసించగల స్టార్ మెగాస్టార్. చిరు ఇండస్ట్రీలో వచ్చి నాలుగు వసంతాలు దాటుతోంది అయినా ఇప్పటి వరకు చేయని ఒక సాహసం ఇపుడు చేయబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తనకు హీరోయిన్ లేకుండానే సోలోగా రంగం లోకి దిగడానికి రెడీ అయిపోయారు చిరంజీవి. అవును ఇది నిజమే. మెగాస్టార్ తాజా చిత్రం ఆచార్య. ఇందులో చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సారిగా వీరిద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తుండటంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

అయితే ఈ చిత్రంలో చెర్రీకి జోడీగా పూజ హెగ్డే నటిస్తుండగా, మెగాస్టార్ మాత్రం సోలో హీరోగా కనిపించనున్నారు. మొదట్లో ఈ మూవీలో చిరుకి హీరోయిన్ గా కాజల్ అనుకున్నారు దర్శకుడు కొరటాల శివ. అయితే ఈ సినిమాలో చిరు హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆమెను తొలగించారు. డైరెక్టర్ కొరటాల ఈ విషయాన్ని కాజల్ కు వివరించడంతో ఆమె అర్దం చేసుకుని తప్పుకున్నారు అని తెలిసింది. అయితే ఇన్నేళ్ల మెగాస్టార్ సినీ జీవితంలో ఎన్నో వందల చిత్రాలను నటించారు చిరంజీవి. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ లేకుండా చేయలేదు.

కొద్దో గొప్పో అయినా హీరోయిన్ పాత్ర ఉండేది. అయితే మొదటి సారి ఇపుడు ఆచార్య మూవీతో చిరు ఏక్ నిరంజన్ అంటూ బరిలోకి దిగనున్నారు. అయితే ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు అదేంటి మెగాస్టార్ పక్కన జోడీ లేకపోతే ఎలా అంటున్నారు. మరికొందరు అభిమానులు మెగాస్టార్ తెరపై కనిపిస్తే చాలు... అడిషనల్ గా తనయుడు చెర్రీ కూడా ఉన్నారు మరి ఇంకేం కావాలి అంటున్నారు.  ఏదేమైనా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర అలాంటిది అందుకే తప్పడం లేదు అంటున్నారు దర్శకుడు కొరటాల.

మరింత సమాచారం తెలుసుకోండి: