ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ పోతినేని కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. అంతకు ముందు ఆయనకు పెద్దగా మాస్ ఫాలోయింగ్ ఉండేది కాదు ఈ చిత్రం చేసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఆయనకు ఈ స్థాయిలో క్రేజ్ ను తీసుకు వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ అని చెప్పాలి. ఆ తరువాత రెడ్ సినిమా కూడా ఆ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. 

ద్విపాత్రాభినయం లో నటించిన రామ్ కి ఈ సినిమా ద్వారా మంచి ఆదరణే దక్కింది. ఈ నేపథ్యంలో మరొకసారి మాస్ ప్రేక్షకులను అలరించాలని చెప్పి తమిళంలో మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్టు అయిన దర్శకుడు లింగుస్వామి తో కలిసి ది వారియర్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు రామ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్ లు ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీని పెంచగా చిత్రంపై అంచనాలు కూడా పెంచాయి.

అలా ఈ సినిమా షూటింగ్ ను తాజాగా పూర్తి చేసుకుని జూలైలో విడుదలకు సిద్ధం అవుతోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈ సినిమా తనకు మాస్ లో మరింత ఫాలోయింగ్ ను సంపాదించి పెడుతుంది అన్న నమ్మకంతో రామ్ ఉన్నాడు. మరి జూలైలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి రాము ఇమేజ్ ను పెంచుతుందో చూడాలి. ఈ చిత్రం తర్వాత మరొక మారు దర్శకుడైన బోయపాటి శ్రీను తో కలసి ఈ హీరో సినిమాను చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: