టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నందమూరి తారక రామారావు మనువడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన నటనతో.. ప్రేక్షకులకు ప్రజలకు సహాయం చేస్తూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఇక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు డబ్బు పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు తన తమ్ముడి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక నష్టం రాకుండా చూసుకుంటారు. అంతే కాదు తన కుటుంబానికి ఎలా ఖర్చు చేస్తారో తమ్ముడు కుటుంబాన్ని కూడా అంతే స్థాయిలో ఖర్చు చేస్తూ తన కుటుంబ సభ్యులను ఎంతో సంతోషంగా చూసుకునేవారు. అలా తారక రామారావు గారి తర్వాత అంతటి ఆలోచనను పొందిన వ్యక్తి మాత్రం జూనియర్...

 ఎన్టీఆర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకానొక సమయంలో తన అన్న కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు నిర్మిస్తూ భారీగా నష్టపోయారు. నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కళ్యాణ్ రామ్ తను నటించిన జై లవ కుశ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే బాధ్యతలు కళ్యాణ్ రామ్ కి అప్పగించి కళ్యాణ్ రామ్ ని అప్పుల బాధ నుంచి బయట పడేసారు తారక్. అంతేకాదు జై లవకుశ సినిమా ద్వారా సుమారు 70 శాతం అప్పులు తీర్చుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా అయినా సరే నిర్మాతగా వ్యవహరించే బాధ్యతను తన అన్న కళ్యాణ్ రామ్ కె అప్పగిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నాడు.

ఒక్క కళ్యాణ్ రామ్ మాత్రమే కాదు మరో నందమూరి హీరో తారకరత్నను కూడా ఎన్టీఆర్ ఆదుకున్నట్లు తెలుస్తోంది. తారకరత్న సినిమాల్లో హీరోగా ఫెయిల్ అయిన సందర్భంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా.. ఎన్టీఆర్ స్వయంగా తనకు ఆర్థిక సహాయం కూడా చేశారు. అది కూడా ఎవరికీ చెప్పొద్దు అంటూ తారకరత్న దగ్గర మాట కూడా తీసుకున్నాడట. అలా ఇద్దరు హీరోలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎన్టీఆర్ వాళ్లకు సహాయం చేసి.. ఇబ్బందుల నుంచి బయట పడేసాడు. ఏదేమైనా కుటుంబం విషయంలో మాత్రం ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: