మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా త్రో బ్యాక్ ఫొటోతో అందరి మైండ్ బ్లాక్ చేసింది. 18 ఏళ్ల ప్రాయంలో తన పరువాలను పరిచయం చేసింది. టీనేజ్ బేబీగా ఉన్నప్పుడు బికినీ ధరించిన ఫోటో పోస్ట్ చేసింది.


 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా 2000 మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకొని అందరి దృష్టిని కూడా ఆకర్షించారు. సాలిడ్ గ్లామర్ కలిగిన ప్రియాంక అనతి కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. అక్కడి టాప్ స్టార్స్ పక్కన నటించిన ప్రియాంక చోప్రా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు  కూడా నమోదు చేశారు.


 


హీరోయిన్ గా ప్రియాంక కెరీర్ సౌత్ లో మొదలైందట. ఆమె డెబ్యూ మూవీ తమిజన్. విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ తమిళ చిత్రం 2002లో విడుదలైందట.. తమిజన్ చిత్రం తర్వాత ఆమె సౌత్ లో చిత్రాలు మాత్రం చేయలేదు.


 

ఐతే హిందీ హిట్ రీమేక్ జంజీర్ లో రామ్ చరణ్ కి జంటగా ప్రియాంక నటించారు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ప్రియాంక తెలుగు ప్రేక్షకుల మనస్సులో పెద్దగా రిజిస్టర్ అయితే కాలేదు. అదే సమయంలో ప్రియాంక... సౌత్ ఇండస్ట్రీపై అసలు ఫోకస్ కూడా పెట్టలేదు. అప్పట్లో నాలుగైదు కోట్లు ఓ హీరోయిన్ కి ఇచ్చే పరిస్థితులు ఇక్కడ అస్సలు లేవు.


 

తర్వాత అమ్మడు క్రేజ్ ప్రపంచవ్యాప్తం కావడంతో హాలీవుడ్ ఎంట్రీ  కూడా ఇచ్చింది. అక్కడ సినిమాలు, సిరీస్లు చేస్తూ స్థిరపడింది. ఈ క్రమంలో హాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ తో ప్రేమలో పడ్డారు. తనకంటే పదేళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తూ ప్రియాంక మరోసారి వార్తలకెక్కింది.


 

ఈ క్రమంలో అనేక సోషల్ మీడియా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. 2018లో నిక్ జోనాస్ ని వివాహం చేసుకొని, న్యూయార్క్ లో కాపురం కూడా పెట్టింది. ఓ లగ్జరీ హౌస్ కొనుగోలు చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని అనుభవిస్తుంది.


 

హాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నప్పటి నుండి బాలీవుడ్ లో సినిమాలు కూడా తగ్గించింది. ఆమె చివరి హిందీ చిత్రం ది వైట్ టైగర్ 2021లో విడుదలైంది. ఇక మోడల్ గా పలు బ్రాండ్స్ కి ప్రచార కర్తగా ఉంటున్న ప్రియాంక చోప్రా, తాజా ఫోటో షూట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది.


 


ప్రియాంక బోల్డ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. కాగా ప్రియాంక చోప్రా ఇటీవల తల్లైన సంగతి తెలిసిందే.ఆమె సరోగసీ పద్ధతి ద్వారా ఓ ఆడపిల్లకు కూడా జన్మనిచ్చారు. ప్రస్తుతం ప్రియాంక 'ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ' అనే హాలీవుడ్ మూవీలో నటిస్తున్నారట . ఈ మూవీలో నిక్ సైతం ఒక చిన్న రోల్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: