త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా షూటింగ్ జులై నుంచి మొదలుకాబోతుంది అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్సినిమా యొక్క ఫైనల్ కథను మహేష్ కి వినిపించగా ఆ సినిమా కి ఒకే చెప్పేశారు మహేష్. సర్కార్ వారి పాత జోష్ లో ఉన్న మహేష్ ఆ జోష్ లోనే ఈ సినిమా ను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా లో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా మహేష్ బాబు 28 వ సినిమా గా ఇది తెరకెక్కుతూ ఉండడం విశేషం.

సినిమా తరవాత మహేష్ రాజమౌళి దర్శకత్వం లో చేస్తుండడంతో ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి. అందులోనూ గతంలో వీరి కలయికలో రెండు సినిమాలు రాగా ఇప్పుడు ఈ సినిమా హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న అంచనాలను వ్యక్తపరుస్తున్నారు. ఏదైతేనేం ఎప్పటినుంచి కలలు కంటున్న అభిమానుల ఆశ వీరిద్దరి కలయిక లో మూడో సినిమా రావడం అది ఇప్పటికి నెరవేరింది.

అయితే ఈ సినిమా అనౌన్స్ అయినదగ్గరినుంచి అందరిలో ఒకటే అనుమానం. ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఏ లెవెల్ లో మహేష్ ను చూపిస్తారని ప్రశ్న అందరిలో మెదిలింది. ఈనేపథ్యంలో ఈ సినిమా కి సంబందించిన నేపథ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో మహేష్ స్పై గా కనిపించబోతున్నాడట. స్పైడర్ సినిమా లానే ఉండే ఓ మంచి కథ తో ఈ సినిమా ను చేయబోతున్నాడట త్రివిక్రమ్. మరి పోలీస్ పాత్రల్లో అలరించే మహేష్ బాబు ఈ సినిమా ద్వారా ఎలా ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం చివరి దశ పనులను చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: