గ్లోబల్ స్టార్ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకచోప్రా హాలీవుడ్ కెరీర్ బాగా సాగిపోతుంది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో జీవితాన్ని పంచుకున్న తర్వాత కెరీర్ మరింత వెలుగులు జిమ్ముతుంది.ఈ హాట్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ స్టార్ ఇక అంతకు మించి అమెరికా కోడలుగా వెలిగిపోతుంది. పుట్టింట భారత్ లో ఎప్పుడు కూడా ఘన స్వాగతముంటుంది. ఇంతకు మించి ఆమె జీవితానికి ఏం కావాలి. ఇక వృత్తి ఇంకా వ్యక్తిగతంగా ఎంతో సాఫీగా సాగిపోతుంది.కానీ ఎందుకనో ప్రియాంక చొప్రాకి ఒక్కసారి అలా గతంలోకి తోంగి చూడాలనిపించిందో! ఏమో కానీ ఓ హాట్ ఫోటోతో అయితే ఇప్పుడు కుర్రళ్లలో ప్రకంపనలు రేపింది. ఇక తన మోడలింగ్ డేస్ అయిన 18 ప్రాయంలో బికినీ వేసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి సలపరం పుట్టిస్తుంది. నాటి మోడలింగ్ రోజుల్ని ఆమె గుర్తు చేసుకుని ప్రియాంక చోప్రా ఇలా కుర్రాళ్లలో కాకలు రేపుతుంది.డ్రాప్ డెడ్ గార్జియస్ బ్రౌన్ కలర్ బికినీలో ప్రియాంక అగ్గి రాజేస్తుంది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో సిర్కా నవంబర్ 2000 క్యాలెండర్ గాళ్ల్ గా ఇలా ఆమె హాట్ గా కనువిందు చేసింది. బక్క పలచని శరీరసౌష్టవం ఇంకా లేలేత ప్రాయంలో అమ్మడు ఏ రేంజ్ లో కవ్విస్తుందో మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం ఈ ఫోటో అయితే నెట్టింట దుమారం రేపుతుంది.ఈ ఫోటో చాలా పాతదే అయినా గ్లోబల్ స్టార్ దుమారం అయితే అసలు మామూలుగా లేదు. ఈ ఫోటోని చూసి రోజూ ప్రియాంక చోప్రాని తనివి తీరా చూసే హబ్బీ నిక్ జోనాస్ సైతం కామెంట్ చేయకుండా ఉండలేకపోయాడు. ఈ ఫోటోకి భగ భగ మండుతోన్న ఫైర్ ఏమోజీని పోస్ట్ చేసి మరింత మంట రేపాడు. ఇక ఇటీవలి కాలంలో రెగ్యులర్ లుక్ లో ప్రియాంక చొప్రాని చూసి బోర్ కొట్టిన జనాలకి ఈ 18 ఏళ్ల ప్రాయం పిక్ కొత్త ఫీల్ ని అందిస్తుంది. ఈ ఓల్డ్ పిక్ ని తనివి తీరా చూసి ఆస్వాదించడం ఇప్పుడు నెటి జనుల వంత్తైంది.ఇక ప్రియాంక చోప్రా సినిమాల విషయానికి వస్తే 'సీటాడెల్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇటీవలే ఆ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై సంచలనం రేపాయి.ఇంకా అలాగే బాలీవుడ్ లో పర్హన్ అక్తర్ తో కలిసి 'జీలే జరా'లో నటిస్తోంది.ఈ రెండు సినిమాలు గాక హిందీలో కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలు వేగంగా జరుపుతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: