కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ అనేక అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యింది. 

కాకపోతే ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్  దగ్గర మినహాయిస్తే ఇతర భాషలలో పెద్దగా కలెక్షన్ లను తెచ్చుకోలేకపోయింది. ఇలా బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమా తలపతి విజయ్ కి కెరీర్ పరంగా 66 వ సినిమా. ఈ సినిమాకు టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయిన దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా , ఈ సినిమాలో విజయ్, సరసన రష్మీక మందన కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను తమిళ్ మరియు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

తలపతి విజయ్ 66 వ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను  జూన్ 21 వ తేదీన సాయంత్రం 6 గంటల 01 నిమిషానికి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే జూన్ 22 వ తేదీన విజయ్ పుట్టిన రోజు. విజయ్ పుట్టిన రోజు కు ముందుగానే విజయ్ 66 వ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసి అభిమానులను చిత్ర  బృందం ఆనంద పరుచనునట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకురుస్తూ ఉండగా,  ఈ మూవీ ని వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: