నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా శృతి హాసన్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

ప్రస్తుతం బాలకృష్ణ , గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమా బాలకృష్ణ కు కెరియర్ పరంగా 107 సినిమా కావడంతో ప్రస్తుతం ఈ సినిమా ఎన్ బీ కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్ బీ కే 107 చిత్ర షూటింగ్ సగం కు పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా,  ఈ టీజర్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ టీజర్ లో బాలకృష్ణ తన అదిరిపోయే మేనరిజమ్స్ తో , డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్ బీ కే 107  సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే... నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. అఖండ మూవీ తో బాలకృష్ణ అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని వంద కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టాడు. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డిసెంబర్ నెలలోనే ఎన్ బీ కే 107 మూవీ ని కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: