రెండేళ్ల నుంచి గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ హిట్లు లేక సతమతమవుతున్న బాలీవుడ్ ప్రతి శుక్రవారం పూట  కొత్త సినిమాలు వచ్చినప్పుడంతా కూడా అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయోనని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తోంది.పాపం ఒక్క హిట్టు వస్తే చాలు ఆపై పది ఫ్లాపులు వచ్చి బాలీవుడ్ కి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.ఇక ఈ నేపథ్యంలో ఇవాళ మాధవన్ రాకెట్రీతో పాటు నార్త్ ఆడియన్స్ ని పలకరించిన మరో మూవీ రాష్ట్ర కవచ్ ఓమ్. ఆషికి 2 ఫేమ్ అదిత్యా రాయ్ కపూర్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి కపిల్ వర్మ దర్శకుడు కాగా ఇందులో సంజనా సంఘీ హీరోయిన్.ట్రైలర్ చూశాక ఇదేదో మాస్ కి కనెక్ట్ అవుతుందేమోనన్న ట్రేడ్ అంచనాలకు భిన్నంగా ఈ రాష్ట్ర కవచ్ ఓమ్ సినిమా బకెట్ తన్నేసింది. దేశభక్తి కాన్సెప్ట్ కాసుల కామధేనువుగా మారిన ట్రెండ్ లో ఇందులో కూడా అదే జొప్పించారు. ఇక ఈ సినిమా అండర్ కవర్ ఆపరేషన్ మీద ఉంటూ శత్రవులకు దొరికిపోయిన ఓ వీరుడి గాథ ఇది.


అతను ఏ మిషన్ మీద పని చేశాడు ఇంకా ఎవరి కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టాడనే పాయింట్ మీద ఈ ఓమ్ రూపొందింది. సినిమా మొత్తం కూడా అతి బిల్డప్పులే. అర్ధం లేని ఓవర్ స్లో మోషన్ షాట్లతో ప్రేక్షకుల కళ్ళకు ఐఎఎస్ పరీక్షని పెట్టారు.కేవలం ఆదిత్య రాయ్ కండలు చూపించాడనికి తప్ప ఈ ఓమ్ ఇంకెందుకు పనికిరాలేదని క్రిటిక్స్ ఓమ్ సినిమా మీద విరుచుకుపడుతున్నారు. ఎమోషన్లను ప్రెజెంట్ చేయడమెలాగో సౌత్ మేకర్స్ నుంచి నేర్చుకోమంటూ ఆర్ఆర్ఆర్ ఇంకా కెజిఎఫ్ లను ఉదాహరణగా చూపిస్తూ చెడుగుడు ఆడేస్తున్నారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు మరీ వీడియో గేమ్ కన్నా చాలా దారుణంగా ఉండటంతో సోషల్ మీడియా ట్రోలింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఇక భూల్ భులాయ్యా 2 విజయాన్ని ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడీ ఓమ్ సినిమా దాని మీద నీళ్లు చల్లేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: