ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఒకరు అయిన రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తం భారతదేశం లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయన ఒప్పుకున్న ఒక్కో సినిమాకి రూ. 120 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దర్శక ధీరుడు రాజమౌళి నిర్మించిన బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కాల్ షీట్ లు అసలు దొరకటం లేదట. వాటి కోసం ఇప్పుడు బడా బడా ప్రొడ్యూసర్స్ అంతా కూడా క్యూలో ఉంటున్నారనే సమాచారం కూడా వినిపిస్తుంది. .

కాగా ప్రభాస్ చేతిలో ఇప్పటికే " 5" కు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఆ ప్రకారం చూసినట్లైతే కేవలం ఈ "ఐదు" సినిమాలకే రూ. 600 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడని మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది. కాగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ సినిమా మాత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పవచ్చు. కాగా అసలు సమస్య ఇప్పుడే మొదలైయింది ఆయన అభిమానులకు.. అసలు ప్రభాస్ ఇన్ని కోట్ల డబ్బుతో ఏం చేయబోతున్నారనే చర్చ అందరిలోనూ మొదలైంది.

అయితే సినీ పరిశ్రమలో చాలా మంది అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణిస్తూ ఉండగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్ తనకి వచ్చిన డబ్బునంతా కూడా హోటల్ బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ముఖ్యంగా చెప్పాలి అంటే స్పెయిన్, దుబాయ్ దేశాల్లోని హోటల్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభాస్ ఎక్కువగా  ఆసక్తి చూపిస్తున్నారట. కాగా అసలు ప్రభాస్ ఏం చేయాలనుకుంటున్నారో వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రభాస్ చేతిలో ఉన్న ఈ 5 సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయి అనేది వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: