కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీ కి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు .

మూవీ లో తలపతి విజయ్ రా ఏజెంట్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన అరబిక్ కుత్తు లిరికల్ వీడియో సాంగ్ ఏ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సాంగ్ అప్పట్లో ఫుల్ వైరల్ కూడా అయ్యింది. అలాగే సినిమా విడుదల అయిన తర్వాత ఈ వీడియో సాంగ్ కూడా అదే రేంజ్ లో క్రేజ్ ను తెచ్చుకుంది. బీస్ట్ మూవీ థియేటర్ లలో పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయినఇప్పటికీ ఈ సినిమాలో ఈ సాంగ్ మాత్రం ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ వీడియో సాంగ్ ఇప్పటికి కూడా యూట్యూబ్ లో అదిరిపోయే రికార్డ్ లను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సాంగ్ మరో రికార్డ్ ను సాధించింది. అరబిక్ కుత్తు వీడియో సాంగ్ 160 మిలియన్ వ్యూస్ తో పాటు తాజాగా  2 మిలియన్ లైక్స్ ని దక్కించుకుని ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా ఇప్పటికి కూడా ఈ సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే రికార్డ్ లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: