కేజిఎఫ్ సినిమాతో హీరోయిన్ గా దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. అగ్ర హీరోల సినిమాలకు ఈ ముద్దుగుమ్మ ఛాయస్ గా ఉంటుంది అని చాలామంది భావించారు. టాలీవుడ్ శాండిల్ వుడ్ వంటి సినిమా పరిశ్రమలలో ఆమె పలు సినిమాలకు సంతకం చేస్తుందని అంచనా వేశారు కానీ ఈ సినిమా విడుదలైన తరువాత ఆమె కెరియర్ అలాంటి వార్తలకు పూర్తి విభిన్నంగా ఉంది. తన చుట్టూ ఉన్న కే జి ఎఫ్ సినిమా హైప్ ను ఎందుకో ఉపయోగించుకోలేకపోయింది శ్రీనిధి అనే చెప్పాలి.

అందానికి అందం మంచి నటన మంచి ప్రతిభ ఆకట్టుకునే బ్యూటీ ఉన్న కూడా ఈ ముద్దుగుమ్మకు ఎందుకు అవకాశాలు రావడం లేదని వార్త ఇప్పుడు అందరిలో అనుమానాలను పెంచుతుంది. అంతటి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా ఆమె కెరియర్ ముందుకు సాగటం లేదు అంటే దానికి కారణం ఏంటా అని అన్వేషణ కొనసాగిస్తున్నారు చాలామంది కెరియర్ మొదట్లోనే ఆమె భారీ పారితోషకాన్ని డిమాండ్ చేయడం తో చాలా అవకాశాలు మిస్ అయిపోతున్నాయని అంటున్నారు.

సౌత్ నుంచి ఆమెకు ఇప్పటికే భారీ ఛాన్సులు వచ్చాయి కానీ అవన్నీ పారితోషకం కారణంగానే వదులుకొందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విక్రమ్ సరసన నటిస్తున్న కోబ్రా సినిమాకి భారీ పారితోషకాన్ని అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ తడబడింది. ఇప్పుడు ఆమె చేతిలో ఈ సినిమా తప్ప మరేది లేదు కనీసం పారితోషకములో అయినా కాంప్రమైజ్ అయ్యి సినిమా అవకాశాలు రాబట్టుకొని మరింత క్రేజ్ పెంచుకున్న తరువాత ప్రేక్షకులను మరింతగా డిమాండ్ చేస్తే బాగుంటుంది అనేది ఆమె అభిమానుల మాట. మరి ఇప్పటికైనా ఆమె పారితోషకం విషయం మానేసి సినిమా అవకాశాల మీద మరింత దృష్టి  పెడితే మరింత మంచిదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: