స్వయంవరం సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది లయ. ఇందులో అందం అబినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో టాప్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఇక ప్రేమించు అనే సినిమాలో అంధురాలివి పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించి నంది అవార్డును కూడా అందుకుంది. తెలుగుతోపాటు తమిళం ,కన్నడ ,మలయాళం వంటి భాషలలో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాలలో మంచి క్రేజ్ ఉండంగానే ఒక ఎన్నారైయితే వివాహం జరిగింది లయ కు.


ఆ తర్వాత కాలిఫోర్నియాలో ప్రస్తుతం సెటిల్ అయింది ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతోంది. కాగా సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తన గ్రామ రసం ఫ్యాషనబుల్ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా తనకు నచ్చిన పాటలకు కూడా డాన్స్ వేస్తూ ఉంటుంది. గతంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం లో బాట కళావతి సాంగ్కు స్టెప్పులు వేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక పాటకు డాన్స్ వేయడం జరిగింది.


అది కూడా అమెరికా వీధుల్లో ఇంతకీ లయ ఏ పాటకు డాన్స్ వేసిందంటే.. అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ సాంగ్కు తన డాన్స్ వీడియోను చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. అమెరికా వీధుల్లో డాన్స్ ట్రాకంటూ ఒక క్యాప్షన్ కూడా తెలియజేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్ ఇంత వైరల్ గా మారుతున్నది. దీంతో అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తూ లైక్ చేస్తూ ఉన్నారు. చివరిగా లయ 2010వ సంవత్సరంలో బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అనే చిత్రంలో నటించినది. ఇక తర్వాత రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: