సెలబ్రిటీలు ప్రముఖులు ఏదైనా సన్నివేశం చేసేటప్పుడు కొన్ని మాటలు చెబుతూనే ఉంటారు. స్వయంగా కొన్ని సన్నివేశాలలో నటించడానికి వెళ్లే సమయంలో అక్కడికి చేరుకోవడానికి చాలా తక్కువ మంది వెళుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ నిర్మాత అయిన బన్నీ వాసు సహాయం చేసే సమయంలో ఒక ప్రమాదం నుంచి మిస్ అయ్యారని వార్త వినిపిస్తోంది. ఈ విషయం గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.


అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలలో కూడా వరద పోటు ఎక్కువగానే ఉంటోంది. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నచోట కొంతమంది సహాయ చర్యలు అందిస్తున్నారు బన్నీ వాసు. ఇందులో భాగంగా ఈసారి పెద్ద సాహసమే చేశారు పశ్చిమగోదావరి జిల్లా లో బాడవ గ్రామంలో ఒక గర్భిణీ వరదలలో చిక్కుకున్నది ఆమెతోపాటు మరి కొంతమంది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్నారు బన్నీ వాసు. వారిని రక్షించే క్రమంలో బన్నీ వాసు ఒక పడవలో వారి వద్దకు వెళ్లి వారి యొక్క క్షేమాలను కనుక్కొని వారిని క్షేమంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వేళ వరద తీవ్రత పెరిగిపోయింది ఈ క్రమంలో వరద పోటు ఎక్కువగా ఉండడంతో వారు ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పడం జరిగిందట.


ఇక అలా వెళుతున్న పడవ కొబ్బరి చెట్టును ఢీకొనడంతో ఆ సమయంలో పడవ నడిపే వ్యక్తి చాలా చురుకుగా ఉండడంతో పడవ ఆగిపోయింది. ఈ సందర్భంగానే పడవ లోపల వారు ఉన్న అంత ఒకసారిగా టెన్షన్ పడడంతో పడవ కాస్త అటు ఇటుగా ఒరిగింది దీంతో పడవ నడిపి వ్యక్తులు ప్రమాదాన్ని ఊహించి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో బన్నీ వాసు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక బన్నీ వాసుతోపాటు అక్కడున్న గర్భవతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక బన్నీ వాసు మాట్లాడుతూ ప్రభుత్వం వీరికి వెంటనే సహాయం చేకూరాలని తెలియజేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: