హీరో తొట్టెంపూడి వేణు పేరు వినగానే మనకి ఎక్కువగా కామెడీ సినిమాలే గుర్తుకు వస్తాయి. వేణు కామెడీ టైమింగ్ డైలాగుతో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈయన బాడి లాంగ్వేజ్ కూడా ప్రతి ఒక్క ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది. మొదట స్వయంవరం చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత చిరునవ్వు ,హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలతో విజయాలను అందుకున్నారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత దమ్ము చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక తర్వాత మళ్లీ కనిపించలేదు.


దాదాపుగా ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత రామారావు వాన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. ఇక ఆలీతో సరదాగా సేవలో పాల్గొన్న తనకు సంబంధించిన అనేక విషయాలను తెలిపారు. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉండడం వల్ల సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా చూసేవారిని దాంతో తిరిగి నటించాలని ఆశ కలిగిందని ఆ తపనతో ఉండంగానే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించే అవకాశం దక్కిందని ఏదైనా మన మంచికే అని రంగంలోకి దిగానని తెలిపారు.


తను మొదటి నుంచి నిదానంగా సినిమాలు చేస్తూ రావడానికి కారణం.. తను ఎవరితోనూ అంతగా తొందరగా కలవలేకపోవడం చోరవ తీసుకొని ముందుకి వెళ్లలేకపోవడం ఈ కారణాల వల్ల ఇండస్ట్రీలో పెద్దగా తనకు పరిచయాలు ఏర్పడలేదట. నాలోని ఈ లోపమే నేను సినిమాలు ఎక్కువగా చేయకపోవడానికి కారణమని భావిస్తున్నట్లుగా తెలిపారు. అందరితో కలిసిపోయి మంచి ప్రాజెక్టులు చేయాలనే విషయం తనకు తెలియదు సినిమాలు వరుసగా చేయాలని ఉంది కానీ తనకు ప్రయత్నించడం లోపం చాలా ఎక్కువే అని తెలిపారు. తను చదువుకునే రోజులలో కూడా తనకు ఒక విషయం అర్థమైంది తమిళనాడులో ఒకవైపు శంకరాభరణం మరొకవైపు డిస్కో డాన్సర్ వంటి చిత్రాలు 200 రోజులు పైగా ఆడాయి.. దీంతో సినిమాలకు భాషతో సంబంధం లేదు కథ బాగా ఉంటే ఎక్కడైనా విజయమందుతుందని అర్థమైనట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: