రెబల్ స్టార్ ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం  మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై దర్శకుడు మారుతి మాట్లాడుతూ ...  ప్రభాస్ తో సినిమా ఉండబోతోంది. ఆ మూవీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఆయన అభిమానిగా నేను ఆయనను డార్లింగ్ మరియు బుజ్జిగాడు మూవీ లలో ఉన్న ప్రభాస్ లాంటి ప్రభాస్ చూపించాలి అని అనుకుంటున్నాను.

నా దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో ప్రభాస్ అలాగే ఉంటాడు అని మారుతి ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న మారుతి , ఇప్పటికే పక్కా కమర్షియల్ మూవీ విడుదల అవ్వడం, ఆ సినిమా పనులు అన్నీ ముగియడం తో ప్రస్తుతం ప్రభాస్ మూవీ పై మారుతి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మారుతి , ప్రభాస్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే అక్టోబర్ నెల నుండి ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.  

అంత లోపు మారుతి , ప్రభాస్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మారుతి , ప్రభాస్ తో హర్రర్ కామెడీ నేపథ్యంలో మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ కి సూపర్ డీలక్స్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: