ఒకప్పుడు కమెడియన్స్ కి సినిమాలు మాత్రమే ఆదాయం. కానీ ఇప్పుడు మాత్రం ఎంతో మంది చిన్న కమెడియన్స్ కి జబర్దస్త్ అనే ఒక మంచి ఫ్లాట్ఫామ్ దొరికింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాలు లేకపోయినా జబర్దస్త్ లో కమెడియన్స్ కామెడీ పంచి గుర్తింపు సంపాదించుకుని ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది కమెడియన్స్ కి  జబర్దస్త్ ఆర్థిక సమస్యలు తీర్చి మంచి పొజిషన్లో నిలబెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ లో సుడిగాలి సుదీర్ ఒకరు.


 ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. సుధీర్ టీమ్ లో గెటప్ శ్రీను రాంప్రసాద్ ఉంటారు. అయితే శ్రీను లాగా సుధీర్ గెటప్ లు వేయలేడు.. రామ్ ప్రసాద్ లాగా ఆటో పంచ్ లతో నవ్వించ లేడు. కానీ తన మీద వేసే పంచులు  మాత్రం స్వీకరించగలడు. ఇదే సుధీర్ కి  ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.  జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ఇటీవల ఈటీవీ నుంచి బయటికి వచ్చి స్టార్ మా లో ప్రత్యక్షమయ్యాడు ఉన్న విషయం తెలిసిందే.


 సుధీర్ తో పాటు శ్రీను కూడా బయటకు వచ్చాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. అయితే ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో శ్రీను మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇవ్వడం కనిపించింది. శ్రీను ఎంట్రీతో అందరూ ఎగ్జైట్మెంట్ కి లోనయ్యారు. అయితే శ్రీను జబర్దస్త్ లోకి రావడానికి నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి కారణమాట. ఆయన చర్చలు జరిపిన కారణంగానే శ్రీను మళ్ళి వచ్చాడట. ఇదే ఇప్పుడు సుధీర్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సుదీర్ కూడా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: