ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు హీరో నాని. మధ్యలో శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఆయన కు కొంత ఊరటను కలిగించినా కూడా ఆ తర్వాత చేసిన అంటే సుందరానికి సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో నానికి ఇప్పుడు మరొక హిట్ సినిమా చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న దసరా సినిమాపైనే ఆయన అభిమానులు అందరూ ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు.

వాస్తవానికి ఈ సినిమా యొక్క ఫస్ట్ లకు వచ్చినప్పుడే పుష్ప చిత్రానికి కాపీ గా ఉందని చాలామంది వెల్లడించా రు. అయితే కంటెంట్ డిఫరెంట్ గా ఉంటుందని కొంతమంది వెనుకేసుకొచ్చారు. ఏదేమైనా ఒక సినిమా తాలూకు ప్రభావం ఈ చిత్రంపై ఉండడం నిజంగా ఈ సినిమాపై అతిపెద్ద మైనస్ ను కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. అందులోనూ ఆ సినిమాను పోలుస్తూ ఈ చిత్రాన్ని అందరూ చూస్తారు.

కాబట్టి ఆ స్థాయిలో ఈ చిత్రం లేకపోతే తప్పకుండా ఈ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధం గా నాని ఈ సినిమాను ఒప్పుకుని తప్పు చేశాడనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే అలరించింది. ఎలివేషన్స్ బాగానే ఉన్నాయి కానీ సినిమా ఏ విధంగా ఉంటుందో తెలియాలి అంటే విడుదల వరకు ఆగాల్సిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ తో కలిసి ఆయన చేసిన నేను లోకల్ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మరొకసారి ఈ జంట కనివిందు చేస్తున్న ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: