దర్శకుడు శరత్ మండువ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా సమ్ సి ఎస్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు . రవితేజ ఈ సినిమాలో సబ్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు .  

మూవీ లో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ ,  రాజిష విజయన్ హీరోయిన్ లుగా నటించగా , వేణు తొట్టెంపూడి ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు . ఈ మూవీ ని జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా బృందం లోని సభ్యులు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు . అందులో భాగంగా తాజాగా ఈ సినిమా దర్శకుడు శరత్ మండవ కూడా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న దర్శకుడు శరత్ మండువ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. 

తాజా ఇంటర్వ్యూ లో దర్శకుడు శరత్ మండువ మాట్లాడుతూ ... రామారావు ఆన్ డ్యూటీ ... రవితేజ లాంటి స్టార్ మాస్ హీరో చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఒక మిస్సింగ్ కేసు ని పోలీసులు గాని లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ గాని డీల్ చేస్తుంది. కానీ ఒక సివిల్ ఆఫీసర్ ఆయన రామారావు ఆ కేస్ ను ఎందుకు డీల్ చేశాడు అనేదే రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో యూనిక్ పాయింట్ అని  తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శరత్ మండువ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: