దేశం లో  కరోనా  అడుగు పెట్టింది మొదలు బాలీవుడ్ కష్టాలను ఎదుర్కొంటోంది.అయితే  కేవలం బాలీవుడ్ అని మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమలు కూడా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.ఇకపోతే కరోనా కష్టం నుండి మెల్ల మెల్లగా కొన్ని ఇండస్ట్రీలు బయట పడుతున్నా బాలీవుడ్ మాత్రం ఇంకా అక్కడే ఉండి పోయింది.కాగా బాలీవుడ్ ప్రేక్షకులు థియేటర్ల కంటే మాకు ఓటీటీ నే బెస్ట్ అన్నట్లుగా సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తిరష్కరిస్తున్నారు. ఇక ఈ ఏడాది లో ఇప్పటి వరకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ హిందీ నుండి పడలేదు.

ఇక బాలీవుడ్ మొత్తం కష్టాల్లో ఉంటే బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మాత్రం లక్కీ చామ్ గా మారింది.అయితే  ఈమె నటించిన సినిమాలు వందల కోట్ల ను వసూళ్లు చేస్తున్నాయి.ఇక ఈ కరోనా కాలంలోనే ఈమె నుంచి భారీ చిత్రాలు పలు వచ్చాయి. పోతే కొన్ని ఓటీటీ లో సూపర్ హిట్ అయ్యి ఈమె స్టార్ డమ్ ను పెంచగా.. మరి కొన్ని థియేటర్ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను నమోదు చేశాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో కియారా అద్వానీ నటించిన భూల్ భులయ్యా 2 దాదాపుగా రెండు వందల కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

ఇదిలావుంటే కరణ్ జోహార్ నిర్మించిన జుగ్ జుగ్ జియో సినిమా కూడా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేసింది. ఇక దాదాపుగా వంద కోట్లకు పైగానే ఆ సినిమా కూడా రాబట్టిందని తెలుస్తోంది.అయితే  అంతే కాకుండా మరికొన్ని సినిమాలు ఈమె నటించగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఆ సినిమా లు కూడా మినిమం వంద కోట్ల వసూళ్లు సాధిస్తాయనే నమ్మకం తో మేకర్స్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు.ఇక అలా కియారా అద్వానీ బాలీవుడ్ లోనే లక్కీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.కాగా  ఈ రెండున్నర ఏళ్ల కాలంలో ఏ ఒక్క హీరోయిన్ కూడా బాలీవుడ్ లో భారీ గా వసూళ్లను దక్కించుకున్నదే లేదు.పోతే  కేవలం ఈ అమ్మడికి మాత్రమే ఆ ఘనత దక్కింది. అయితే అందుకే ఈమెతో వర్క్ చేసేందుకు బాలీవుడ్ నుండి సౌత్ వరకు అంతా ఆసక్తిగా ఉన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: