మాజీ మిస్ వరల్డ్ ఇంకా బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీ టౌన్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఇంకా దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ..కేవలం దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ క్రేజ్‌ ఆమెను బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. క్వాంటికో, ఎ కిడ్ లైక్ జేక్ ఇంకా బే వాచ్ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. బాలీవుడ్‌లో కూడా తగ్గేదేలే అంటోంది. ప్రస్తుత ప్రియాంకా చోప్రా చేతిలో జీ లే జరా, షీలా ఇంకా కల్పనా చావ్ల బయోపిక్ వంటి పలు సినిమాలు ఉండగా.. వాటి షూటింగ్ కూడా కొనసాగుంతోంది.ఇక ప్రియాంక చొప్ప మంచి నటి మాత్రమే కాదు.. ఆమె మంచి మనసున్న స్త్రీ కూడా. అమ్మతనం తెలిసిన ప్రియాంక చొప్రా.. పసి పిల్లల విషయంలో అయితే చాలా సున్నితంగా ఉంటుంది. ఇక యునిసఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా ఉంది. తాజాగా ఓ దృశ్యాన్ని చూసి ప్రియాంక చోప్రా బోరున విలపించడం జరిగింది. కొందరు చిన్నారులను హత్తుకుని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతోంది.


యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా తాజాగా పోలాండ్‌ను విజిట్ చేసింది. ఇక అక్రడ రష్యా దాడి కారణంగా నిరాశ్రయులైన ఉక్రెయిన్‌కు చెందిన కొందరు చిన్నారులను ఇంకా మరికొందరిని కలిసింది. ఆ చిన్నారుల ధీన స్థితికి చలించిపోయిన ప్రియాంక చొప్రా కన్నీరు పెట్టుకుంది. వారిని హత్తుకుని బాగా ఏడ్చేసింది. ఆ తరువాత వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, వారితో కాసేపు సరదాగా కూడా గడిపింది.ఇంకా బాధిత పిల్లలతో ఆటలాడింది. డ్రాయింగ్ ఇంకా పెయింటింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొంది. అక్కడ కొందరు చిన్నారులు చేతితో చేసిన బొమ్మలను ప్రియాంక చోప్రాకు బహుమతిగా ఇచ్చారు. వాటికి పేర్లు పెట్టాల్సిందిగా వారు కోరారు. అలా చిన్నారులతో గడిపిన క్షణాలను ప్రస్తావిస్తూ ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. దానికి ఆమె క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఉక్రెనియన్ల అవస్థలను వివరిస్తూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆ పోస్ట్‌లో ప్రస్తావించింది ప్రియాంక చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: