తాజాగా విజయ్ దేవరకొండ హీరోగ్ నటించిన లైగర్ సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లలో వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. అయితే దాదాపుగా 90 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో కేవలం 23 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.ఇకపోతే ఫుల్ రన్ లో ఈ సినిమా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం కూడా కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కాగా  లైగర్ సినిమా నిర్మాతలలో ఒకరైన ఛార్మిసినిమా రిజల్ట్ పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదిలావుంటే ప్రస్తుతం ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని ఒక్క క్లిక్ తో కంటెంట్ ను యాక్సెస్ చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు.

ఇకపోతే  ఫ్యామిలీతో సహా టీవీలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను చూడవచ్చని ఛార్మి చెప్పుకొచ్చారు. కాగా సినిమాలు ప్రేక్షకులను ఎగ్జైట్ చేయనంత వరకు ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఇష్టపడరని ఛార్మి చెప్పుకొచ్చారు. బాలీవుడ్ విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదని ఆమె చెప్పుకొచ్చారు.అయితే బాలీవుడ్ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ముందు ఇతర విషయాలపై కూడా దృష్టి పెడుతున్నారని ఛార్మి కామెంట్లు చేశారు.ఇక  ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలైన బింబిసార, కార్తికేయ2, సీతారామం సినిమాలు సక్సెస్ సాధించాయని ఆమె చెప్పుకొచ్చారు.

కాగా సౌత్ సినిమాలంటే గతంలో ఉన్న పిచ్చి బాలీవుడ్ లో ఇప్పుడు లేదని అనిపిస్తోందని ఛార్మి కామెంట్లు చేశారు.అంతేకాదు  బాలీవుడ్ లో పరిస్థితి నిరుత్సాహకరంగా భయానకంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.అయితే బాలీవుడ్ వల్లే లైగర్ కు దారుణంగా కలెక్షన్లు వచ్చాయని అక్కడే తప్పు జరిగిందని ఛార్మి పరోక్షంగా అభిప్రాయపడ్డారు.కాగా  లైగర్ మూవీ గురించి ఛార్మి మాట్లాడుతూ 2019 సంవత్సరంలో మేము కరణ్ జోహార్ తో కలిశామని చెప్పుకొచ్చారు. ఇక 2020 సంవత్సరం జనవరిలో లైగర్ మూవీ మొదటి షెడ్యూల్ ను మొదలుపెట్టామని ఛార్మి చెప్పుకొచ్చారు.అయితే  కరోనా లాక్ డౌన్ వల్ల దాదాపుగా మూడేళ్ల తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చామని ఛార్మి కామెంట్లు చేశారు.ఇకపోతే  ఎన్నో మంచి ఆఫర్లను కోల్పోయి లైగర్ ను థియేటర్లలో విడుదల చేశామని ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకోవడం బాధ కలిగిస్తోందని ఛార్మి చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: