ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీ   ప్రతిపక్షంలోకి వెళుతుంది. ఇలా అవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం పాలన అనేది ప్రజలకు నచ్చకపోవడమే. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఈ ప్రభుత్వంపై ఏడాది కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరచు మీడియా ముఖంగా అంటున్నారు. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకతే వైసీపీని అధికారంలోకి వచ్చేలా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు. కేవలం ప్రభుత్వ వ్యతిరేకతే జగన్ ని అధికారంలోకి తీసుకువస్తుందా? జగన్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారా? జగన్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఆయన రెక్టిఫై చేసుకుంటున్నారా.. 

ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనేది నిజమే కావచ్చు కానీ  జగన్ దాన్ని సానుకూలంగా మలిచే విధానంలో విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ప్రజలు జగన్ ని నమ్మాలి అంటే  ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కాస్త చూసుకోవాలి. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో వైసిపి హయాంలో మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చారు.. ఈ విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రజా వ్యతిరేకానికి కారణమైంది. అంతేకాకుండా జగన్ హయాంలో నాసిరకం మద్యం బ్రాండ్లు కూడా వచ్చాయి.. ఇవే కాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటో ప్రింట్ చేయించుకోవడం.. సంక్షేమ పథకాల పేరుతో కేవలం బటన్ నొక్కడం ఆ పథకాలను గాలికి వదిలేయడం వంటివి చేశాడు.

ఈ విధంగా ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు ఒకింత ప్రజలను భయాందోళనకు గురిచేసారని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈ తప్పులపై ఆయన  ఓసారి సమాలోచనచేసి మరోసారి తప్పులు జరగకుండా చూస్తానని ప్రజలకు భరోసా కల్పించాలి. కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అది చేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.. దాన్ని ఆయన పాజిటివ్ గా మార్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో అంతకంటే ఎక్కువ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలి.  ఐదేళ్ల పాలనలో ప్రజల్లో సృష్టించిన భయాన్ని  పోగొడితేనే జగన్ కు  భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: