
మర్రెడ్డిపై స్థానిక స్థాయిలో విమర్శలు పెరుగుతున్నాయి. పార్టీ పాత కేడర్‌ను పక్కనబెట్టి, కొత్తగా వైసీపీ నుంచి చేరిన వారిని ప్రోత్సహిస్తున్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా, పిఠాపురంలో ఎదురవుతున్న సమస్యలను పార్టీ అధిష్టానానికి పూర్తిగా తెలియకుండా ఆయన మ్యానేజ్ చేస్తున్నారన్న విమర్శలు స్థానిక జనసేన కేడర్‌లో ఉన్నాయి. ఈ కారణంగా స్థానికంగా పార్టీ లోపల సమన్వయం దెబ్బతిందని, వర్గపోరాటాలకు దారి తీస్తోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పలుమార్లు జోక్యం చేసుకుని, అందరు కలసి కట్టుగా ముందుకు సాగాలని సూచించారు.
అయినా మర్రెడ్డి వ్యవహారశైలి లో పెద్దగా మార్పు కనిపించలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్న వారికి గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం నెలకొంది. మర్రెడ్డి తరచుగా పిఠాపురంలో ఉండకపోవడం, గెస్ట్‌లా వ్యవహరించడం కూడా స్థానిక కేడర్‌ను మరింత దూరం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థంకాని స్థితిలో ఉన్నామంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ఇంచార్జ్ మార్పు జరుగుతుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
అయితే కీలక నాయకులు ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు రావడం సహజమని, వాటిని పరిష్కరించుకునే ప్రయత్నాలు జరుగుతాయని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల పిఠాపురం పరిస్థితులపై సీరియస్‌గా వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీంతో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాల్సి ఉంది. ఏదేమైనా పవన్ పిఠాపురం పార్టీ కేడర్‌లో అసమ్మతి రాకుండా చూసుకోవాలి.. లేకపోతే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేందుకే ఆపపోసాలు పడే పరిస్థితి వస్తుంది.